SBI ready for one-time settlement on Kingfisher Airlines loan

Sbi willing to settle kingfisher loan issue with vijay mallya

loan default case, SBI, State Bank of India, Vijay Mallya, Kingfisher Airlines, vijay mallya, vijay mallya news, kingfisher, mallya ub spirits, mallya loan amount, money laundering case, vijay mallya kingfisher

State Bank of India is open to reaching one-time settlement on the payback of loan Kingfisher Airlines if Vijay Mallya repays the principal along with a reasonable amount of interest.

బెట్టు వీడి మెట్టు దిగిన బ్యాంకులు.. మాల్యా కొత్త షరతులు

Posted: 07/05/2016 09:13 AM IST
Sbi willing to settle kingfisher loan issue with vijay mallya

అసలు కంటే వడ్డీయే ముద్దు అనుకునే బ్యాంకులు.. ఒక పెట్టు దిగితున్నాయి. వడ్డీ కంటే అసలు వచ్చినా పర్వాలేదని భావిస్తున్నాయి. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా నుంచి ఎలాగైనా తమ బకాయిలను వసూలు చేసుకోవడం కోసం ఎస్‌బీఐ తగ్గింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు ఇచ్చిన రుణాలలో విజయ్ మాల్యాతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు సిద్ధంగా ఉంది. తమకు రావాల్సిన అసలు మొత్తంతో పాటు కొంత వడ్డీని కోర్టుపరమైన ఖర్చులను చెల్లిస్తేనే ఈ సెటిల్‌మెంట్‌కు తాము ఒప్పుకుంటామని ఎస్‌బీఐ అంటోంది.

గత కొన్నాళ్ల కిందట ఆయనే న్యాయస్థానాల్లో ఈ మేరకు తాను రుణాలను చెల్లిస్తానని చెప్పడంతో బ్యాంకులు అయన చెప్పినట్లుగానే డబ్బును తీసుకునేందుకు అంగీకరించగా, తాజాగా ఆయన ఈ విషయంలో మరికొన్ని షరతులు పెడుతున్నారు. మాల్యా పెడుతున్న షరతులు తమకు ఆమోదయోగ్యం కావని బ్యాంకులు పేర్కొంటున్నాయి. డెట్ రికవరీ చట్టాల్లో సవరణలను పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీకి ఎస్‌బీఐ చైర్‌పర్సన్ ఈ అంశాలను వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఆ సంస్థ యజమాని విజయ్ మాల్యా ఎస్‌బీఐ సహా 17 బ్యాంకుల నుంచి పొందిన రుణాలు, వడ్డీతోకలిపి రూ.9,000 కోట్లకుపైగానే బకాయిపడ్డారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా ఆయనను పలు బ్యాంకులు ప్రకటించాయి. కోర్టుల్లో కూడా కేసులు వేశాయి. ఐడీబీఐ బ్యాంకుకు సంబంధించిన రుణ ఎగవేత కేసులో ముంబై మనీల్యాండరింగ్ నిరోధక కోర్టు ప్రకటిత నేరగాడుగా తేల్చింది. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ఇంటర్‌పోల్ సహా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బ్యాంకుల కన్సార్షియంకు ఎస్‌బీఐ నేతృత్వం వహిస్తోంది.

మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.4,850 కోట్లు కాగా, వడ్డీతో కలిపితే మొత్తం రూ.9,000 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టుకు మాల్యా తరఫున లాయర్లు తమ క్లయింట్ సెప్టెంబర్‌కల్లా రూ.4,000 కోట్లు చెల్లించేందుకు సిద్ధమేనంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం విదితమే. అంతేకాకుండా తనకున్న కొన్ని కోర్టు కేసులు పరిష్కారమైతే మరో రూ.2,000 కోట్లు కూడా కడతానని మాల్యా ప్రతిపాదించారు. దీంతో బ్యాంకులు కూడా వచ్చిన సోమ్మును ముందుగా రాబట్టుకుందామని ప్రణాళికలు రచిస్తున్నాయి.

దీంతో మెట్టు దిగిన బ్యాంకులతో మాల్యా సెటిల్ మెంట్ అంటూనే కొత్త షరుతులు విధిస్తున్నారు. గతంలో ఆయన తరపు న్యాయవాదులు కోర్టులలో వేసిన అఫిడెవిట్ లో పేర్కోనట్లు కాకుండా మరో విధంగా అయితేనే తాను సెటిల్ మెంట్ కు సుముఖం అన్న సంకేతాలు ఇస్తున్నారు. రూ.4,850 కోట్ల అసలు, వడ్డీ రూపంలో రూ.150 కోట్లతో పాటు బ్యాంకులు కోర్టు కేసుల కోసం ఖర్చుపెట్టిన ఫీజులను చెల్లించేందుకు మాల్యా సిద్ధమేనంటూ ఆయన సలహాదారులు సంకేతాలిచ్చినట్లు సమాచారం. మరి దీనికి బ్యాంకులు అంగీకరిస్తాయా..? కేంద్రం అమోదం తెలుపుతుందా అన్న విషయం వేచి చూడాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : loan default case  SBI  State Bank of India  Vijay Mallya  Kingfisher Airlines  

Other Articles