CBI arrests Kejriwal’s principal secretary, four others, draws furious AAP reaction

Fresh political row erupts as cbi arrests cm s key official

arvind kejriwal, rajendra kumar, principal secretary, kejriwal, corruption, cbi, aap, arvind kejriwals principal secretaty arrested, rajender kumar arrested, delhi secratariat, modi government, india news

Reacting furiously to Kumar’s arrest, Delhi Deputy Chief Minister Manish Sisodia accused Prime Minister Narendra Modi of “hatching a conspiracy to paralyse the Delhi government

ఢిల్లీలో ప్రభుత్వ ఉన్నతాధికారుల అరెస్టు..

Posted: 07/05/2016 07:05 AM IST
Fresh political row erupts as cbi arrests cm s key official

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపి కనివిని ఎరుగని రీతిలో ఓటమి పాలైనందుకు గాను ప్రతికారం తీర్చుకుంటుంది. అసలు దేశానికి నరేంద్రమోడీ ప్రధానిగా వున్నారా.? లేక ఢిల్లీకి మాత్రమే ప్రధానిగా వున్నారా..? అన్నది అర్థం కానీ ప్రశ్న. నిత్యం ఢిల్లీలోని అప్ ప్రభుత్వంపై తన అధిపత్యం చాటుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నం సాగిస్తుంది. ఇదే ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి సంబంధించిన డిడిసీఏ కేసులో ఆయనకు అనుకూలంగా చర్యలు తీసుకోవడంలో సఫలమైన కేంద్ర ప్రభుత్వం.. అవినీతి పేరు చెప్పి తమ అధికారులను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం. ఇది అప్ ఢిఫ్యూటీ ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా కేంద్రప్రభత్వంపై చేసిన అరోపణలు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ సహా ఐదుగురిని సీబీఐ అవినీతి కేసులో అరెస్ట్ చేయడంపై అప్ నేతలు భగ్గుమంటున్నారు. ఒక ప్రైవేటు కంపెనీకి రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను అప్పగించటంలో అక్రమంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రాజేంద్రకుమార్ తదితరులను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఇది కేవలం ప్రతికార చర్యలు మాత్రమేనని, అయితే వీటిన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఇక మీదట జరిగే ఎన్నికలలో బీజేపికి తమ తీర్పుతోనే ప్రజలు తీర్పునిస్తారని అన్నారు. ‘మోదీ గారూ, మాకు కేవలం ప్యూన్లు మాత్రమే మిగిలేలా చేసినా.. వారితో మేం ప్రభుత్వాన్ని నడుపుతాం’ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.

కేజ్రీవాల్ కార్యాలయంలో ఉప కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణ్‌శర్మ, మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులతో పాటు రాజేంద్రకుమార్‌ను కూడా సోమవారం ఉదయం విచారణ నిమిత్తం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. మధ్యాహ్నం వరకూ వారిని ప్రశ్నించిన తర్వాత.. రాజేంద్రకుమార్, తరుణ్‌శర్మలతో పాటు రాజేంద్ర సన్నిహితుడు అశోక్‌కుమార్, ప్రైవేటు సంస్థ యజమానులు సందీప్‌కుమార్, దినేశ్‌గుప్తాలను అరెస్ట్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఎండీవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వ టెండర్లు ఐదింటిని దక్కించుకోవటానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజేంద్రకుమార్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని గత ఏడాది డిసెంబర్‌లో సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులు నేరపూరిత కుట్రలో చేరి ఢిల్లీ ప్రభుత్వానికి 2007- 2015 మధ్య కాంట్రాక్టుల కేటాయింపులో రూ. 12 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపించింది.

నిందితులైన అధికారులు ఆ కాంట్రాక్టు కేటాయించే క్రమంలో రూ. మూడు కోట్లకు పైగా అనుచిత లబ్ధి పొందారనీ ఆరోపించింది. అరెస్టు చేసిన నిందితులను మంగళవారం కోర్టు ఎదుట హాజరుపరుస్తామని సీబీఐ తెలిపింది. ఈ పరిణామాలపై సిసోడియా స్పందిస్తూ.. ‘సీఎం ఆఫీసును స్తంభింపజేసే కుట్ర జరుగుతోంది. సీఎం ముఖ్యకార్యదర్శి, ఉప కార్యదర్శులను అరెస్ట్ చేశారు. సహాయ కార్యదర్శిని అండమాన్‌కు బదిలీ చేశారు. ఇదంతా కేవలం ఒక్క రోజులో జరిగింది. ఢిల్లీలో 1991లో ఒక ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ.. కేంద్ర ప్రభుత్వం దిగజారిన అత్యంత అధమ స్థాయి ఇదే’ అని అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  CBI  Corruption case  PM Modi  Tarun sharma  

Other Articles