Baghdad blast: Deadliest terror attack in Iraq's capital in 2016 kills at least 165

Is bombing kills 165 ramadan shoppers in baghdad

Baghdad Blast, explosion, Iraq, IS, ISIL, ISIS, islamic-state, Mideast, suicide blast, Terrorism, World news

A suicide car bombing claimed by the Islamic State group ripped through a busy Baghdad shopping district, killing at least 165 people in the deadliest attack.

బాగ్ధాద్ లో మారణహోమం.. వరుస పేలుళ్లుతో..

Posted: 07/03/2016 08:41 PM IST
Is bombing kills 165 ramadan shoppers in baghdad

బంగ్లాదేశ్ రాజధానిలో ముష్కరులు సృష్టించిన నరమేధం ఉదంతం తాలుకు ఘటనను మర్చిపోకముందే.. రెండు రోజుల వ్యవధిలో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులం అని చెప్పుకునే  తీవ్రవాదులు.. సరిగ్గా అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అందులోనూ ఉపవాస దీక్షలు చేస్తున్న క్రమంలో ముస్లింలనే టార్గెట్ గా చేసుకుని మరీ వరుస బాంబు పేలుళ్లతో దాడులు చేసి ఇరాక్ లో నరమేధం సృష్టించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ముష్కర మూక బాంబు దాడులకు తెగబడింది.

రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడుల్లో 165 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 125గా బీబీసీ పేర్కొంది. ఎంత మంది మృతి చెందారనేది ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్దాలను నింపి పేల్చివేశారు. ఈ ఘటనలో వంద మందిపైగా మందికి పైగా మృతి చెందారు.

భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baghdad Blast  explosion  Iraq  IS  ISIL  ISIS  islamic-state  Mideast  suicide blast  Terrorism  World news  

Other Articles