I'm victim of both the system and corrupt politics says Anupama Shenoy

Victim of corrupt politics says karnataka woman cop anupama shenoy

Anupama Shenoy,Anupama Shenoys Resignation,Former DSP Anupama Shenoy,Deputy Superintendent of Police Anupama Shenoy,Karnataka Woman Cop,Karnataka Woman Police Officer,Karnataka Womens Commission,Labour and District in-charge Minister PT Parameshwar Naik

Former Deputy Superintendent of Police Anupama Shenoy had earlier written a letter to the commission accusing Ballari Superintendent of Police R Chetan of harassing her by succumbing to political pressure

కరెప్ట్ పాలిటిక్స్ కాలనాగు కాటుకు బలయ్యాను..

Posted: 07/01/2016 02:23 PM IST
Victim of corrupt politics says karnataka woman cop anupama shenoy

పురుషాధిక్య వ్యవస్థ,  కరెప్ట్ పాలిటిక్స్ కాలనాగు కాటుకు తాను బలయ్యానని మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ ఆవేదనగా చెప్పారు. బెంగళూరులోని కర్ణాటక మహిళా కమిషన్ కు వచ్చిన అనుపమా మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన ఆరోపణలు చేశారు. పురుషాధిక్య సమాజంతోపాటు అవినీతి రాజకీయాల వల్ల మహిళా అధికారిణుల సమస్యల ఎదుర్కోంటున్నారని వాటికి పరిష్కార మార్గాన్ని కర్ణాటక మహిళా కమిషన్ కనుగొనాలని అనుపమ సూచించారు.

రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పనిచేయాలని బళ్లారి ఎస్పీ ఆర్ చేతన్ ఒత్తిడి తీసుకురావడంతోపాటు వేధించారని అనుపమ మహిళా కమిషన్ కు గతంలో రాతపూర్వకంగా లేఖ రాశారు. పురుషాధిక్య వ్యవస్థలోని లోపాలు, రాజకీయ ఒత్తిళ్ల సమస్య మహిళా అధికారులకు రాకుండా నివారించేందుకే తాను ఈ పోరాటం చేస్తున్నానన్నారు. తాను చేస్తున్న పోరాటం మానసిక శాంతిని ఇస్తుందని అనుపమ వివరించారు. కర్ణాటక కార్మికశాఖా మంత్రి పీటీ పరమేశ్వరనాయక్ పై ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టిన అనుపమ సంచలనం సృష్టించి విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తలెత్తిన వివాదంతో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. అనుపమతో తలెత్తిన వివాదం అనంతరం జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వేటు వేశారు. కాగా అనుపమ ఇచ్చిన ఫిర్యాదుపై తాము ప్రాథమిక విచారణ జరిపామని, ఈ కేసు విచారణను జులై 16కు వాయిదా వేస్తున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మంజుల మన్సా చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anupama Shenoy  Parameshwar Naik  Victim  Corrupt Politics  Karnataka  

Other Articles