Police in Amsterdam broke into flat after 'lifeless' woman was seen hanging inside

Dutch police break in to flat after woman is seen hanging inside

Dutch police, amsterdam police, sex doll, blown up lady toy, suicide, hanging, 'lifeless' woman, inflatable sex doll, police break flat, latest news, world news

Dutch police broke into a flat after a woman was seen 'hanging' inside - only for officers to find the body was a blow up sex doll.

పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన యువతి...

Posted: 06/30/2016 01:18 PM IST
Dutch police break in to flat after woman is seen hanging inside

అపార్టుమెంటులో అత్మహత్య చేసుకున్న యువతి నిర్జీవంగా అటు, ఇటూ ఊగడం స్థానికులను కంగారు పెట్టించింది. వారితో పాటు సమాచారాన్ని అందుకున్న పోలీసులను కూడా ఉరుకులు, పరుగులు పెట్టింది. తలుపులు తట్టినా ఎవరూ తియకపోవడంతో ద్వారాన్ని బద్దలు కోట్టి మరీ లోపలకు దూసుకెళ్లిన అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వారికి అందిన సమాచారం కరెక్టే. అక్కడ నిర్జీవంగా గాలికి వూగుతున్న ఓ యువతి కూడా వుంది. అయితే ఆ యువతి అసలు ప్రాణం లేనిదని తెలిసి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంకా అర్థంకాలేదా..? తలుపులు వేసి ఉన్న తమ పక్క అపార్టుమెంటోలోని ఓ గదిలో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిందని, నీర్జీవమై గాలికి అటుఇటు ఊగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని తలుపులు కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో తలుపులు బద్దలుకోట్టి లోనివెళ్లిన పోలీసులు అది యువతి శవం కాదని, గాలితో నింపిన ఓ యువతి సెక్స్ డాల్ అని తెలుసుకుని నవ్వుతూ వెనుదిరిగారు. తమకు ఇలాంటి అరుదైన అనుభవం ఎదురైందని చెప్పుకోడానికి ఈ ఘటన ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ సంఘ‌ట‌న నెద‌ర్లాండ్‌ తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. బొమ్మ అచ్చం మ‌హిళ‌లాగే క‌నిపించింద‌ని, అంతేకాక వేలాడుతూ ఉండ‌డంతో మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని తాము భావించిన‌ట్లు స్థానికులు చెప్పారు. రూంలో వేలాడుతూ క‌నిపించింది మ‌హిళ కాక‌పోవ‌డంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అక్క‌డ‌ సెక్స్ వర్క్కు చట్టబద్ధత ఉండ‌డంతో షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ ని విక్ర‌యిస్తారు. అయితే ఉరివేసుకున్న‌ట్లు బొమ్మ‌ను ఎందుకు వేలాడ‌దీశారు..? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles