JEECUP topper result cancelled amid cheating scam

Jeecup topper result cancelled amid cheating scam

UP Polytechnic Entrance Exam, Gautam Buddha Inter College, Ghazipur district, Paras Singh Kushwaha, Sadar Police Station, JD Manoj Kumar, jeecup,jeecup cheating,jeecup topper,jeecup result,toppers scam,uttar pradesh

JEECUP has cancelled the result of topper along with 28 other examinees in the top list due to mass cheating. All these students had given exam in single room of Gautam Buddha Inter College located in the Ghazipur district.

ఎనమిది స్పెలింగ్ తెలుసా..? కాస్త.. వీళ్లకు చెప్పరూ..!

Posted: 06/30/2016 10:47 AM IST
Jeecup topper result cancelled amid cheating scam

మీరు చదవిన శీర్షక కరెక్టే. మీకు ఎనమిది స్పెల్లింగ్ తెలుసా..? మాకేంటీ మా తమ్ముడు 1వ తరగతి చదువుతున్నాడు వాడికి కూడా వచ్చు. అయినా ఈ స్పెల్లింగ్ రానీ వారుంటారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయా..? అవునండీ నిజమే. మీకు తెలిస్తే.. కాస్తా ఈ టాపర్లకు చెప్పరు. ఏంటీ పాలిటెక్నిక్ టాప్ ర్యాంకర్లకు ఎయిట్ స్పెల్లింగ్ తెలియదా..? మేము వాళ్లకు చెప్పాలా.? అంటూ ఆశ్చర్యపోకండి.. మీరు చదివింది కరెక్టే. ఈ టాపర్లకు ఎయిట్ స్పెల్లింగ్ రాదు. ఏదో ఒక్కరు అనుకుంటే కాదండీ ఏకంగా 28 మందికి ఎయిట్ స్పెల్లింగ్ రాదు. అదేంటి..?

పొలిటికల్ సైన్స్ అంటే వంటశాస్త్రమని చెప్పి బీహార్ ఇంటర్మీడియట్ టాపర్ రూబీ రాయ్ ఆశ్చర్యపర్చిన అంశాన్ని ఇంకా మర్చిపోక ముందే మరో టాపర్స్ స్కామ్ బయటపడింది. అయితే ఈ సారి బీహార్ లో కాకుండా మరో ఏడాది కాలంలో ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్ ప్రదేశ్ లో స్కామ్ బయటపడింది. ఉత్తరప్రదేశ్ పాలిటెక్నిక్‌లో టాపర్లుగా నిలిచిన వారిపై అనుమానం వచ్చిన యూపిలోని టెక్నికల్ బోర్డు వారికి పరీక్ష నిర్వహించింది. టాపర్లను 8 అంకె స్పెల్లింగును రాయమంటే అంతా గుడ్లు మిటకరించి, బిక్కమొఖం వేసుకుని చూశారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది పాలిటెక్నిక్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులు 8 అంకెను ఆంగ్లంలో ఎలా రాయాలో తెలీకపోవడంతో బిక్క ముఖం వేసుకుని నిలబడ్డారట. దీనితో పరీక్ష నిర్వహించేవారికి అనుమానం వచ్చి మరలా తాము రాయమన్నది 8 అనే అంకెకు ఆంగ్లంలో స్పెల్లింగ్ అని చెప్పారట. ఐనా వారి నుంచి సమాధానం లేదు. దీనితో సదరు విద్యార్థుల సత్తా ఏమిటో తెలిసిపోయి ప్రవేశ పరీక్షా సమయంలో వారంతా మోసాలకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. వెంటనే వారి ఫలితాలను రద్దు చేయడమే కాకుండా మళ్లీ వారు పరీక్ష రాయకుండా చర్యలు తీసుకున్నారు. ఇక పాలిటెక్నిక్ పరీక్షలను కూడా రద్దు చేసి.. మరోమారు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

అయితే వీరి మోసాలపై సాంకేతిక విద్య విభాగం అధికారులు జెడీ మనోజ్ కుమార్ నేతృత్యంలో నలుగురు సభ్యలతో కమిటీ విచారణ చేపట్టగా అందులో మరిన్ని విస్మయానికి గురిచేసే విషయాలు బయటపడ్డాయి. యూపీ పాలిటెక్నిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 28 మంది విద్యార్థులందనూ ఒకే పరిక్షా కేంద్రం నుంచి.. అందులోనూ ఓకే గదిలో పరిక్ష రాసారని అధికారులు తెలుసుకున్నారు. అలాగే ఆ విద్యార్థులను ప్రవేశ పరీక్షలో అర్హులుగా చేసిన గౌతమ్ బుద్దా ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ పై కూడా చర్యలకు తీసుకున్నారు. ఇదిలావుండగా, మెడికల్ కాలేజీ కోసం బీహార్ లో ఓ కేంద్రమంత్రి అండతో ఆ స్కామ్ జరిగిందన్న అరోపణల నేపథ్యంలో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్ ప్రదేశ్లో ఈ స్కామ్ వెనుక ఎవరున్నారన్నది తేల్చాల్సివుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jeecup  jeecup cheating  jeecup topper  jeecup result  toppers scam  uttar pradesh  

Other Articles