తాత్కాలిక సచివాలయం ప్రారంభం | AP Temporary Secretariat in Velagapudi launched

Ap temporary secretariat in velagapudi launched

AP Temporary Secretariat, Velagapudi temporary secretariat, AP Secretariat, Minister Ayyanna Patrudu Launches AP Temporary Secretariat, వెలగపూడి సచివాలయం, తాత్కాలిక సచివాలయం, వెలగపూడి సచివాలయం, ఏపీ వార్తలు, రాజకీయాలు

AP Temporary Secretariat in Velagapudi launched grandly.

ITEMVIDEOS: తాత్కాలిక సచివాలయం ప్రారంభం

Posted: 06/29/2016 03:49 PM IST
Ap temporary secretariat in velagapudi launched

అమరావతి నుంచే పాలన కొనసాగించాలన్న ఏపీ ప్రభుత్వ పట్టుదల ఫలించింది. నవ్యాంధ్ర లో తాత్కాలిక సచివాలయం బుధవారం ప్రారంభమయ్యింది. అమరావతిలోని వెలగపూడిలో సెక్రటేరియేట్ భవనానికి కాసేపటి క్రితం వేద మంత్రాల నడుమ ప్రారంభించారు. మధ్యాహ్నం 2.59 నిమిషాలకు  లాంఛనంగా ప్రారంభమయ్యింది. దీంతో సాంకేతికంగా పాలన ప్రారంభించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం అమలయినట్లు అయ్యింది. మొదటి దశలో తాత్కాలిక సచివాలయానికి వెళ్లనున్న వైద్య ఆరోగ్యశాఖ, గృహ నిర్మాణ శాఖ, కార్మిక శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల కార్యాలయాలను సంబంధిత శాఖల మంత్రులు ప్రారంభించారు.

ఐదో బ్లాక్ ను ప్రారంభించిన అయ్యన్నపాత్రుడు పంచాయితీ రాజ్ కార్యాలయానికి పూజలు నిర్వహించాడు. అనంతరం ఆయన సమక్షంలో ఉద్యోగులు తమ విధులను లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో పూర్తి స్థాయిలో పాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.

సెక్రటేరియట్ ఏర్పాట్లు;
సెక్రటేరియట్ కు సంబంధించి మొత్తం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 50 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఉద్యోగుల కోసం చాంబర్లు సిద్ధం చేశారు. వారికి ఇబ్బందులు లేకుండా ఫ్యాన్స్, ఏసీ, వెలుతురు ఏర్పాట్లు చేశారు. అలాగే, ఉన్నతాధికారులకు ప్రత్యేక ఛాంబర్లు నిర్మించారు. ప్రతి శాఖ అధికారి చాంబర్‌కు పక్కనే కంప్యూటర్‌ ఆపరేటర్ల గదులు నిర్మించారు. ఇతర సెక్షన్‌ ఉద్యోగులకు హాల్‌లో చాంబర్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి నిరంతరం విద్యుత సరఫరా అయ్యేలా ప్రాంగణంలోనే పవర్‌ షిఫ్టింగ్‌ స్టేషన్‌ను నిర్మించారు. విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకునే ఉద్యోగుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఐదు మెట్రో బస్సులను ఏర్పాటు చేసింది. ఇవి తాడేపల్లి, మందడం మీదుగా సచివాలయానికి చేరుకుంటాయి. సాయంత్రం తిరిగి 5.15 గంటలకు తిరిగి విజయవాడకు బయల్దేరతాయి.

కాగా.. ఇప్పటికే హెచ్ఓడీ 124 కార్యాలయాల్లో 64 ఇప్పటికే తరలిపోయాయి. మిగతా వాటిని కూడా త్వరలో తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి జూలై 6వ తేదీ కల్లా మిగతా శాఖల ఉద్యోగులు కూడా తమ కార్యాలయాలకు చేరనున్నారు. రోడ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Temporary Secretariat  Velagapudi  Amaravathi  

Other Articles