csir launches ayurveda anti diabetic drug for rs 5 per tablet

Csir launches ayurvedic anti diabetic drug

Council for Scientific and Industrial Research, CSIR, BGR-34 - an anti-diabetic ayurvedic drug, type 2 Diabetes, controlling blood sugar, side effects of other drugs, National Botanical Research Institute, A K S Rawat, Daya Nandan Mani, health, diabetic news

India’s Council for Scientific and Industrial Research (CSIR) has launched BGR-34, an anti-diabetic ayurvedic drug designed for type 2 Diabetes mellitus.

ఇది నిజంగా ‘తీపి’ కబురు.. రూ.5కే మందు..!

Posted: 06/28/2016 01:45 PM IST
Csir launches ayurvedic anti diabetic drug

ఇది నిజంగా తీపి కబురే. వందలు, వేలు పెట్టి మందులు కోనుగోలు చేసే వారికి అత్యంత చౌవకైన ధరకు అవి లభిస్తున్నాయంటూ ఒకింత ఆనందమే. చక్కర వ్యాధి అనగానే అప్పటి వరకు ఎంతటి ధైర్యంగా వున్నవారైనా.. క్రమంగా మనోధైర్యాన్ని కోల్పోతుంటారు. దీనికి రెండు కారణాలు ఒకటి వారికి వచ్చిన షుగర్ వ్యాధి వారిని బాధిస్తుండగా, ఆ వ్యాధిని నయం చేసేందుకు వందలు, వేల రూపాయలతో మందులు కోనుగోలు చేయడంతో వారిని అర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది.

దీంతో మధుమేహం వ్యాధి బారిన పడిన రోగులు అంతకంతకూ తమలో తాము క్షీణిస్తుంటారు. కాగా, అలాంటి వారికి నిజంగా తీపి కబరును అందించి.. అత్యంత చౌవకైన ధరకు అయుర్వేద మందులను అందిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధక మండలి(సీఎస్‌ఐఆర్) సోమవారం కొత్తగా ఆయుర్వేదిక్ యాంటీబయోటిక్ ఔషధం బీజీఆర్-34ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఔషధం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి, శరీరంపై ఇతర ఔషధాల దుష్ర్పభాలను తగ్గింస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్‌బీఆర్‌ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు. లక్నోలోని ఎన్‌బీఆర్‌ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్(సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా ఈ ఔషధాన్ని అభివృద్ధిచేశాయి. కర్ణాటక సహా సరిహద్దు రాష్ట్రాలో 5 రూపాయలకే దీన్ని ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ ఏఐఎంఐఎల్ ముందుకు వచ్చింది. కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు తదితరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ ఔషధాన్ని తయారుచేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anti diabetic drug  CSIR  Ayurvedic medicine  doabetic news  health  

Other Articles