వైఎస్ జగన్ కి కొత్త వ్యాధి? | Jagan suffers from social personal disaster

Jagan suffers from social personal disaster

Minister Devineni Uma on jagan, jagna suffers with new disease, agan suffers from social personal disaster

Minister Devineni Uma satirical comments on Jagan. Says Jagan suffers from social personal disaster.

జగన్ ఆ వ్యాధితో బాధపడుతున్నాడంట!

Posted: 06/27/2016 12:08 PM IST
Jagan suffers from social personal disaster

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యాధితో బాధపడుతున్నారంట. ప్రస్తుతం లండన్ నుంచి తిరిగి బయలుదేరిన ఆయన వచ్చి రాగానే అధికార పక్షంపై విసుర్లు విసిరేందుకు సిద్ధమయిపోతున్నాడు. ఈ క్రమంలో ఆయన లేనన్ని రోజులు విమర్శల బాధ్యతను తన మానసపుత్రిక అయిన సాక్షి కి అప్పజెప్పి వెళ్లారు. మంత్రి దేవినేని ఉమా తన కుటుంబంతో పెద్దఎత్తున్న కుంభకోణాలు చేస్తున్నారంటూ కథనాలు ప్రచురించింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన ఉమా జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఆయనకు విచిత్రమైన వ్యాధి ఉందంటూ వ్యాఖ్యలు చేసిన ఉమా ఈసారి ఆ వ్యాధేంటో చెప్పేశారు. జనగ్ సోషల్ పర్సనాలిటీ డిజాస్టర్ వ్యాధితో బాధపడుతున్నాడంటూ ఛలోక్తులు పేల్చారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తాను అవినీతికి పాల్పడ్డానంటూ సాక్షి పత్రిక ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్... అదే కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటిచ్చినప్పుడే ఆ వ్యాధి బయటపడిందని కూడా దేవినేని అన్నారు. జగన్ 420 కావడం వల్లే తమపైనా 420 కేసులు పెట్టాలంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రెచ్చగొడితే బండారాలను కూపిలాగుతామంటూ హెచ్చరికలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister Devineni Uma  YS jagan  social personal disaster  

Other Articles