private travels bus catches fire, travelers escape

Private travels bus catches fire travelers escape

fire accident in private travels bus, vijayawada, kakinada, bus fire accident, keesara, ranganreddy, kartheek travels

A private bus departured from kakinada and travelling to vijayawada catches fire at keesara in vijayawada, paasengers escaped by jumping from running bus

ITEMVIDEOS: కాలిపోయిన కార్తిక్ ట్రావెల్స్ బస్సు..

Posted: 06/27/2016 07:06 AM IST
Private travels bus catches fire travelers escape

ఇవాళ తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు పెను ప్రమాదమే తప్పింది. విజయవాడ నుంచి బయటు దేరిన కార్తీక్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్పీడుగా దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన సమయంలో ప్రయాణికులు అప్పుడప్పుడే నిద్ర నుంచి కొలుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన ప్రయాణికులంతా బస్సు రన్నింగ్ లో ఉండగానే కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రయాణికులను పెను భయాందోళనకు గురి చేసిన ఈ ఘటన హైదరాబాదు శివారు ప్రాంతం కీసర సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే... హైదరాబాదు నుంచి 40 మంది ప్రయాణికులతో కార్తీక్ ట్రావెల్స్ బస్సు కాకినాడకు బయలుదేరింది. కీసర వద్దకు చేరుకోగానే బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. అప్పటికే చాలా మంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నా... మెలకువగా ఉన్న కొందరు వేగంగా స్పందించారు. బస్సులో మంటలు చెలరేగిన విషయాన్ని డ్రైవర్ కు చెప్పిన వారు నిద్రలో ఉన్న ప్రయాణికులను తట్టి లేపారు. అంతా కలిసి బస్సు నుంచి కిందకు దూకేశారు. ఈలోగా బస్సును డ్రైవర్ ఓ పక్కగా ఆపేశాడు. ఆగీ ఆగగానే ఆ బస్సును మంటలు దహించివేశాయి. దీంతో నడిరోడ్డుపైనే బస్సు పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles