Acid attack on college lecturer in Bhopal, attackers flee from spot

Acid thrown on girl by two motorcycle borne men

Rajesh singh chandel additional superintendent of police,Madhya Pradesh,bhopal,woman,Acid attack,motorcycle,Borne men,Narmada hospital

In a tragic incident, a 24-year-old woman became prey of a horrifying acid attack in Madhya Pradesh’s Bhopal city.

కాలేజ్ కోసం ఇంటి నుంచి బయలుదేరుతుండగా..

Posted: 06/18/2016 07:17 PM IST
Acid thrown on girl by two motorcycle borne men

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ లెక్చరర్ ఇంటిముందే ఆమెపై యాసిడ్ దాడి పోసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇవాళ ఉదయం కాలేజీ వెళ్లేందుకు ఇంటి నుంచి బాధిత లెక్చరర్ బయల్దేరగా.. బైకులపై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ దాడి చేసినట్టు హబీబ్గంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి రవీంద్ర యాదవ్ చెప్పారు.

దాడిచేసిన వారిలో ఒకడు ముఖానికి ముసుగు ధరించగా, మరొకడు బుర్ఖా వేసుకున్నాడు. కాగా బుర్ఖా వేసుకున్న వ్యక్తి మహిళా లేక మగవాడా అన్న విషయం తెలియరాలేదు. నిందితులను పోలీసులు ఇంకా గుర్తించాల్సివుంది.బాధితురాలి చేతులు, మణికట్టుపై గాయాలయ్యాయి. ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఇద్దరు గుర్తుతెలియని దుండగులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Acid attack  college teacher  Bhopal  madya pradesh  crime  

Other Articles