ఒక్క లెటర్ తో కేసీఆర్ గాలి తీసేశాడు | Union minister JP Nadda writes letter to KCR about funds

Union minister jp nadda writes letter to kcr about funds

Health minister, JP Nadda, telangana CM KCR, central minister writes letter to KCR about funds, Union minister JP Nadda writes letter to KCR about fundsకేంద్రమంత్రి షాక్, కేసీఆర్, తెలుగు వార్తలు, తాజావార్తలు, telugu news, latest news, కేసీఆర్ కి నద్దా లేఖ, కేసీఆర్ గాలి తీసేశాడు, telangana news

central minister writes letter to KCR about funds. JP Nadda mentioned spend regular funds first.Union minister JP Nadda writes letter to KCR about funds

ఒక్క లెటర్ తో కేసీఆర్ గాలి తీసేశాడు

Posted: 06/18/2016 10:58 AM IST
Union minister jp nadda writes letter to kcr about funds

తెలంగాణను మొండిచెయ్యి చూపిస్తూ, ఆంధ్రకు అడ్డగోలుగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. ఇది గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ అండ్ కో చేస్తున్న ఆరోపణ. అయితే కనీసం అవసరమైన మేర నిధులు కూడా ఇవ్వడం లేదంటూ స్వయానా కేసీఆర్ చేస్తున్న వాదనలో పస లేదని తేలిపోయింది. అయితే కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించే విషయంపై తెలుగు రాష్ట్రాలు అసలు దృష్టి సారించడం లేదంటూ కేంద్రం చెబుతోంది. ఇచ్చిన నిధులను సరిగ్గా వినియోగించకుండా ఇప్పుడు తమకు మరిన్ని నిధులు కావాలని లేఖలు రాయటం కరెక్ట్ కాదంటోంది.

కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా ఇటీవలె తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాశారు. ‘ముందు అసలు ఇచ్చిన నిధులను సరిగ్గా ఖర్చు చేయండి మహాప్రభో' అంటూ అందులో పేర్కొన్నారు. ఇచ్చిన నిధులను ముందుగా ఖర్చు పెట్టండి, ఆ తర్వాత మరిన్ని నిధులు గురించి అడగండి అంటూ సూచించారు. అసలు విషయం ఏంటంటే... జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద ఏటా తెలంగాణకు కేంద్రం రూ.1,000 కోట్లు విడుదల కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 60 శాతం కేంద్ర నిధులు, 40 శాతం రాష్ట్ర వాటా ఉంటుంది.

అయితే ఈ  పథకం అమలుపై గత రెండేళ్లుగా తెలంగాణ సర్కారు ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు గతేడాది కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఇంకా రూ.438 కోట్లు అలాగే మిగిలే ఉన్నాయంట. వీటిలో రూ.143 కోట్లను ఆర్థిక శాఖ నిలిపివేయటం గమనార్హం. ఇదే విషయాన్ని నద్దా ప్రస్తావిస్తూ ముందు ఇచ్చిన నిధులను సరిగ్గా సద్వినియోగపరుచుకోడంటూ పరోక్షంగా కేసీఆర్ కు పంచ్ వేశారు. ఈ లేఖ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ అధికారుల అత్యుత్సాహంతో తో విషయం బయటికి వచ్చింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Health minister  JP Nadda  telangana CM KCR  

Other Articles