mudragada pabmanabham health condition detoriates

Mudragada pabmanabham hunger strike reaches ninth day

mudragada hunger strike, mudragada padmanabham, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike

Kapu caste leader Mudragada padmanbham says he wont break his fast untill the government comes forward to fullfill eleection promises amid his health condition detoriates on ninth day.

ప్రాణాపాయ స్థితిలో ముద్రగడ.. కాపు నేత అరోగ్యంతో ప్రభుత్వం ఆటలు

Posted: 06/17/2016 07:33 AM IST
Mudragada pabmanabham hunger strike reaches ninth day

కాపు కులస్థులను బిసిలలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ.. కాపు హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను తొమ్మిదవ రోజుకు చేరుకుంది. దీంతో ఆయన అరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి జారుకున్నారు.. బుధవారం ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించి, రక్త నమూనాలను సేకరించేలా వైద్యులకు సహకరించిన ముద్రగడ నిన్న ఆ మాత్రం కూడా సహకరించలేదు. కాపు వర్గానికి చెందిన టీడీపీ మంత్రలు చేస్తున్న వ్యాఖ్యలను అయనను కించపర్చేలా వున్నాయని భావించిన ఆయన మళ్లీ వైద్యులకు సహకరించడం లేదు. దీంతో ఆయన పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని వైద్యులు అంటున్నారు. తొమ్మిదవ రోజు మంచినీళ్లు కూడా తీసుకోకుండా అమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ శరీరంలో కీటోన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

దీంతో ఆయన అరోగ్య పరిస్థితి మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకుంటుందని.. ఈ నేపథ్యంలో అయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకోందని వైద్యులు చెబుతున్నారు. ఆయన బీపి షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో లేవని తెలుస్తుంది. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన అరోగ్యరిత్యా మంచిది కాదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ముద్రగడ దీక్షపై నోటితో సానుభూతిని వ్యక్తం చేస్తూనే.. నోసటితో వక్కిరించే విధంగా చర్యలు చేపట్టడంతో ముద్రగడ కలత చెందారని అందుచేతనే ఆయన వైద్యానికి సహకరించడం లేదని వార్తలు వినబడుతున్నాయి.

మరోవైపు ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా.. ఆయన ఆరోగ్యంతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడుతోందని కాపు నేతలు విమర్శిస్తున్నారు. ఓవైపు అధికారులను పంపి, చర్చలంటూ వైద్యానికి ఒప్పించి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు మంత్రులతో ఎగతాళి వ్యాఖ్యలు చేయించి ముద్రగడ వైద్యానికి నిరాకరించే స్థితికి కారణమైంది. ఇప్పుడాయన  వైద్యాన్ని పూర్తిగా నిరాకరించడంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందో చెప్పలేమని వైద్యులంటున్నారు.

ముద్రగడ ఆరోగ్యం విషమించిందనే సమాచారం బయటకు రావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగసింది .గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు, యువకుల బైక్ ర్యాలీలు జరిగారుు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ముద్రగడ వైద్య నివేదికలు అంతా సవ్యంగా వున్నాయని స్పష్టం చేయడం పట్ల మంత్రులు అవహేళన చేసేలా వ్యాఖ్యానించడాన్ని కాపు నేతలు తిప్పకోట్టారు.

ముద్రగడ అరోగ్యంపై హైదరాబాద్ అస్పత్రుల వైద్యులతో పరిక్షలు చేయించి నివేదికలు బహిర్గతం చేస్తే మంత్రుల మాటల్లో నిజమెంతో తెలిపోతుందని పేర్కోన్నారు. ముద్రగడకు ఏదైనా హాని జరిగితే.. టీడీపీ ఇక రాష్ట్రంలో కనుమరుగవ్వక తప్పదని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. ముద్రగడ ప్రాణాపాయ స్థితిలో వున్నారని తెలుస్తున్నా ఆయన అరోగ్యంతో ప్రభుత్వం అటటాడుతుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ఇష్టంలో పబ్బం గడుపుకునే నేతలు.. ఎన్నికల ముందు ఎలా హామీలను గుప్పించారని వారు దుయ్యబట్టారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles