A pedestrian smashed window of BMW to rescue dog from sweltering car in Grand Bend

Ontario pedestrians rescue dog locked in car during 30 degree heat

Ontario, pedestrian, dog, heat, BMW, Car window, small dog in Grand Bend, pedistrian smash car window, pedestrian rescues small dog, orintario small dog resued, viral video

The incident occurred in Grand Bend, Ontario, with a witness, Will Costa, telling local media he was worried about the welfare of the small dog

ITEMVIDEOS: నెట్ లో హల్ చల్ చేస్తున్న కారు అద్దం ధ్వంసం వీడియో..

Posted: 06/16/2016 06:33 PM IST
Ontario pedestrians rescue dog locked in car during 30 degree heat

అతనో వృద్దుడు. అయితే పుష్కలంగా మానవత్వం నిండిన వాడు. అంతే అతను చేసిన పనితో ఏకంగా హీరో అయ్యాడు. అదేంటి హీరో అయ్యాడంటే ఏ చిత్రంలో నటించాడని కాదు.. తాను చేసిన పనితో హీరో అయ్యాడు. అతను చేసిన పనేంటి అనేగా.. పార్కింగ్లో ఉన్న ఓ కారు అద్దాన్ని బండరాయితో పగులగొట్టాడు. వార్నీ అయితే మేమూ హీరలం అవుతామంటూ బండరాళ్లలో కనిపించిన కార్ట అద్దాలన్నీ పగులగోట్టేరు. అక్కడే వుంది అసలు విషయం. అతడు తన శాయశక్తులా ప్రయత్నించి బీఎండబ్యూ కారు అద్దం పగులగోట్టాడు.

కెనడాలో ఒంటారియోలోని గ్రాండ్ బెండ్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో అతను హీరో అయ్యాడు. కారు అద్దం పగులగోట్టడానికి, అతనిలో మానవత్వం మూర్తిభవించిందని చెప్పడానికి లింకే లేదే..? అనేదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.. గ్రాండ్ బెండ్ లో జరుగుతున్న ఓ ఫెస్ట్కు చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతులు తమ కుక్కను కారులోనే వదిలేసి వెళ్లారు. లాక్ చేసి ఉన్న కారులోనే ఆ కుక్క చాలా సమయం నుంచి ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటంతో అప్పటికే ఆ శునకం నీరసించిపోయింది.

అయితే కుక్క కారులో ఉందని, యజమానులు రావల్సిందిగా ముందుగా ఓ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అక్కడికి ఎవరూ రాకపోవడంతో చివరకు అక్కడే ఉన్న బండ సాయంతో కారు అద్దం పగులగొట్టి కుక్కను బయటకు తీశాడు ఓ బాటసారి. 'ఆ కుక్క పరిస్థితి చూసి చాలా జాలేసింది. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కారులో మరింత వేడికి కుక్క మగ్గిపోయింది. కారు అద్దాలు పగుల గొట్టిన మరో గంట వరకు అక్కడికి కారు యజమానులు రాలేదు. ఒక వేళ ఆ వ్యక్తి అలా చేసి ఉండకపోతే కుక్క పరిస్థితి మరింత విషమంగా మారేది..'అని ప్రత్యక్ష సాక్షి  విల్ కోస్టా తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్క యజామానులను స్టేషన్ కు తీసుకువెళ్లారు. బాటసారి కారు అద్దం పగులగొడుతున్న సంఘటనను అక్కడే ఉన్న వారు వీడియో  తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో అతన్ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యజమానుల నిర్లక్ష్య ధోరణితో ఎన్నో పెంపుడు శునకాలు కార్లలోనే వదిలి వెళ్లడంతో వేడిమికి, ఊపిరాడక బలవుతున్నాయి. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ontario  pedestrian  dog  heat  BMW  Car window  viral video  

Other Articles