సాధారణంగా ఎవరికైనా లోన్ కావాలంటే ఏం చేస్తారు? తమకున్న చరస్థో, స్థిరాస్థో తాకట్టుపెట్టి బ్యాంక్ లను నుంచి లోన్ తీసుకుంటారు. కానీ, చైనాలో మాత్రం అలా కాదు. అందమైన అమ్మాయిల అందాలపైనే లోన్ లు జారీచేసేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లోన్ ఫర్ ఫోర్న్ పై అధికారిక మీడియా బీజింగ్ యూత్ డైలీతోపాటు, అంతర్జాతీయ మీడియా దిగార్డియన్ కూడా ఇప్పుడు కథనాలు ప్రచురించాయి. ఏపీలో జరిగిన కాల్ మనీ లాంటి దానిని తలపించే దీని వివరాల్లోకి వెళితే...
కాలేజీల్లో చదువుతున్న అందమైన అమ్మాయిలను టార్గెట్ చేస్తూ, ఎంతో కాలంగా ఈ పోర్న్ స్కాం జరుగుతోంది. వివిధ యూనివర్శిటీల్లో చదివే అందమైన అమ్మాయిలను లక్ష్యం చేసుకుని, వారిని సంప్రదించి, వారి నగ్న చిత్రాలను సేకరిస్తూ, వారికి రుణాలు అందిస్తున్నారని తెలిపింది. దారుణమైన విషయం ఏంటంటే... అలా చిత్రాలు దిగుతున్న సమయంలో వారి చేతిలో ఐడీ కార్డులు ఖచ్ఛితంగా ఉండాలంట. అలా ఉంటేనే వారికి మరింత మొత్తం లోన్ గా దొరుకుతుందని నమ్మబలుకుతున్నారు. ఇలా ఐడీతో అమ్మాయిలు నగ్న చిత్రాలు దిగితే, వారికి రెండు నుంచి ఐదు రెట్ల వరకూ అదనపు రుణం చెల్లిస్తున్నారు సదరు పోర్న్ సైట్ యజమానులు. ఆర్థిక అవసరాలు కోసం ఇంతకు మించి మరో మార్గం కనిపించడం లేదని భావిస్తున్న అమ్మాయిలు ఈ ఉబిలోకి దిగేస్తున్నారు.
అంతా అయ్యాక రుణాలు వసూలు చేసే టైంలో దారుణాలు చేస్తున్నారు. సకాలంలో తిరిగి చెల్లించకుంటే, వారి చిత్రాలను ఆన్ లైన్లో లీక్ చేస్తామని, అధిక వడ్డీలు కట్టాల్సి వుంటుందని ముందుగానే బెదిరింపులకు పాల్పడుతున్నారంట. జేడీ కాపిటల్ అనే ఓ సంస్థ నిర్వహిస్తున్న 'జిడాయిబావో' అనే వెబ్ సైట్ ఈ మొత్తం కుంభకోణంలో ముందుందని తెలుస్తోంది. ఈ సంస్థ ఎలాంటి తనఖాలు లేకుండానే అధిక రుణాలు ఇవ్వటం, అది కూడా 21 నుంచి 28 ఏళ్ల లోపు కావటంతో అసలు అనుమానాలు మొదలై ఈ పోర్న్ స్కాం వెలుగుచూసింది. ఇక అసలు రుణాలను చెల్లించలేని స్థితిలో ఉన్న అమ్మాయిలచేత వ్యభిచారం చేయిస్తున్నారని విచారణలో తేలింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more