pavithra the cheating bride got arrested after marring seven men

Pavithra marries 7 men duping one after another

fake marriage, duping husbands, cheating, cheating woman, cheating lady, Pavithra,mariammal,malathi,angenlina, 7 times marriage, dowry, gold, property, Tamil Nadu

Police have arrested the 25-year-old woman, who married seven men one after another. The cheating lady's name is Pavithra alias mariammal alias malthi alias angenlina and she used to disappear with stolen money, gold and other valuable items after getting married to a person.

సీన్ రివర్స్.. అడ్డంగా దొరికిపోయిన ‘పెళ్లికూతరు’ పవిత్ర..

Posted: 06/15/2016 05:02 PM IST
Pavithra marries 7 men duping one after another

సులువుగా డబ్బు సంపాదించేందుకు అనేక మంది అక్రమ మార్గాలను అలవర్చుకుని రాత్రికి రాత్రి సంపన్నులు కావాలని కలలు కంటుంటారు. అయితే ఈ మధ్య ట్రెండు మార్చిన మాయగాళ్లు అఖరి నూరేళ్ల జీవితాన్ని కలసి గడిపే కళ్యాణాన్ని కూడా తమ అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది పెళ్లి పేరుతో ఎంతోమంది అమ్మాయిలను మోసం చేసి నగలతో ఉడాయించిన కిలాడి కృష్ణుల గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

మాయగాళ్లకు ఏ మాత్రం తీసిపోనంటూ అదే మార్గాన్ని ఎంచుకుని ఏకంగా ఏడు మందిని వివాహమాడింది పవిత్ర. అసలు ఈ పవిత్ర ఎవరూ అంటే.. పేరు మార్చుకుని బ్రోకర్ల ద్వారా ఏడుగురు యువకులను పెళ్లిచేసుకుని వారితో కొన్ని రోజులు మాత్రమే గడిపి నగలు, నగదుతో ఉడాయించింది. 8వ సారి మరో యువకుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధం కాగా మొదటి భర్తతో పట్టుబడిన సంఘటన తిరుపూర్ జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది.

వివరాల్లోకి వెళితే...తిరుపూర్ జిల్లా తారాపురంకు సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన నటరాజ్ పశువుల వ్యాపారి. ఇతని కుమారుడు సెల్వకుమార్‌కు పెళ్లి చేయాలని పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డారు. చివరకు బ్రోకర్ ద్వారా దిండుకల్ జిల్లా పళని సమీపంలోని పొదుపట్టి గ్రామానికి చెందిన పవిత్ర (25)తో నిశ్చయం చేసి గత 2015 అక్టోబర్‌లో పెళ్లి చేశారు.ఈ క్రమంలో గత మే 27వ తేదీ తారాపురం పోలీసుస్టేషన్‌కు వచ్చిన సెల్వకుమార్ తన భార్య పవిత్ర 15 సవర్ల నగలతో కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

పోలీసులు పవిత్రను వెతుకుతున్న సమయంలో ఆమె మొదటి భర్త కర్ణన్ (35)తో ఉడుమలై ప్రాంతంలో అజ్ఞాతంలో తల దాచుకున్నట్లు తెలిసింది. ఆమె అసలు పేరు మారియమ్మాళ్ అని, మాలతి, పవిత్ర, ఏంజలిన్ అనే పలుపేర్లతో ఏడుగురిని మోసం చేసి వివాహం చేసుకున్నానని, మొదటి భర్త కర్ణన్, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కూతురు దొరకని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని వారితో కొన్ని నెలలు కాపురం చేసి దొరికిన నగలు, డబ్బులతో ఉడాయించడం ఆమె వృత్తిగా పెట్టుకుందని విచారణలో తెలిపింది.

దీంతో ఉడుమలై బస్టాండులో నిలబడి ఉన్న పవిత్ర అలియాస్ మారియమ్మాళ్‌ను ఆమె మొదటి భర్త కర్ణన్‌ను తారాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈమె తిరువూర్ జిల్లా పల్లడం అరిమాలినగర్‌కు చెందిన సెల్వరాజ్. పళని అమ్మాల్ దంపతులకు ఒకే కూతురు. మొదటి భర్త కర్ణన్‌తో తన పేరు మాలతి అని చెప్పి ఏడో భర్త సెల్వకుమార్‌తో పవిత్ర అని చెప్పి వివాహం చేసుకుంది. ఈమె పెళ్లి కొడుకుల వేటకు తారాపురం, ఉడుమలై, పళని, తిరుపూర్ ప్రాంతాలకు చెందిన పెళ్లి బ్రోకర్లు తొమ్మిదిమంది బ్రోకర్లు సహాయం చేశారు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheating woman  husbands  marriages  kk nagar  pavithra  chennai  tamilnadu  

Other Articles