Jasprit Bumrah's best figures help India bundle Zimbabwe out for 123 in 3rd ODI at Harare

Ind vs zim 3rd odi zimbabwe bowled out for 123

india vs zimbabwe live, live ind vs zim, ind vs zim live, live ind vs zim, india zimbabwe live, ind vs zim 3rd odi live score, ind vs zimbabwe 3rd odi live score, ind vs zim 3rd odi match live score, india zimbabwe 3rd odi live score, india zimbabwe 3rd odi live score, 3rd odi india zimbabwe, india zimbabwe live streaming,

Zimbabwe’s batting collapses once again to get bowled out for 120 in the third One-Day International (ODI) against India at Harare.

బెంబేలెత్తిన జింబాబ్వే.. క్లీన్ స్వీప్ దిశగా యువసేన

Posted: 06/15/2016 03:37 PM IST
Ind vs zim 3rd odi zimbabwe bowled out for 123

జింబాబ్వే పర్యటనలో అతిధ్యజట్టుపై టీమిండియా యువసేన మరో విజయాన్ని నమోదు చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలన్న తమ ఆశలను సజీవం చేసుకుంది. ధోని యువసేనలోని బౌలర్లు జింబాబ్వే అటగాళ్లను తమ బంతులతో బెంబేలెత్తించారు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా మూడో వన్డేలోనూ దూకుకు కోనసాగిస్తుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకు కుప్పకూలింది. దీంతో జింబాబ్వే 124 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. భారత బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించి నాలుగు వికెట్ల పడగొట్టాడు. జట్టులో అత్యధికంగా సిబండా 38 పరుగులు చేశాడు. జింబాబ్వే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుంది.

పరుగుల వేటలో బోల్తా: మూడో వన్డేలోనూ జింబాబ్వే బ్యాట్స్మెన్ పరుగుల వేటలో చతికిలపడ్డారు. చిబాబా 27, మరుమా 17, మడ్జివా 10 (నాటౌట్) పరుగులు చేయగా, ఇతర ఆటగాళ్ల స్కోరు సింగిల్ డిజిట్కే పరిమితమైంది. భారత బౌలర్లు చహల్ రెండు, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో భారత్ బౌలర్ ధావల్ కులకర్ణి.. ఓపెనర్ మసకద్జ (8)ను అవుట్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత చిబాబా, సిబండా కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఆచితూచి పరుగులు రాబట్టారు. దీంతో రన్రేట్ మందగించింది. చహల్ వీరిద్దరినీ అవుట్ చేయడంతో జింబాబ్వే తేరుకోలేకపోయింది. ఇక బుమ్రా.. మరుమాను పెవిలియన్కు చేర్చడంతో జింబాబ్వే వికెట్ల పతనం వేగంగా సాగింది.

వరుసగా 4 వికెట్లు: ఇన్నింగ్స్ 33వ ఓవర్లో చివరి రెండు బంతులకు భారత బౌలర్ బుమ్రా వరుసగా మరుమా, చిగుంబరలను అవుట్ చేశాడు. మరుమాను బౌల్డ్ చేయగా, చిగుంబర క్యాచ్ను వికెట్ల వెనుక ధోనీ అందుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్ అంటే ఇన్నింగ్స్ 34వ ఓవర్ తొలి బంతికి వాలర్ రనౌట్ అయ్యాడు. పటేల్ ఆ తర్వాతి బంతికి క్రెమెర్ను ఎల్బీగా వెనక్కిపంపాడు. దీంతో జింబాబ్వే వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జింబాబ్వే ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు. టిరిపనో రనౌట్ అవడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs zimbabwe 2016  jasprit bumrah  india  zimbabwe  cricket  

Other Articles