అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకోవటం. అనక అధికారాన్ని చేపట్టి ఇచ్చిన హామీలను మర్చిపోవడం.. ఇదేమిటని ప్రశ్నించి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే.. పోలీసు లాఠీలతో తన్నించడం చంద్రబాబుకు అలవాటేనని ధైర్యంగా చెప్పిన కాపు హక్కుల ఉద్యమకర్త ముద్రగడ పద్మనాభం అంటే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకంత దడ. ముద్రగడ చేస్తున్న దీక్ష నేపథ్యంలో మీడియాను శాసించేంత వరకు ఎందుకు వెళ్లారు..? తన మీడియాలో ముద్రగడ దీక్ష గురించి ఒక్క ముక్క కూడా రానీయకుండా ఎందుకు నిలువరిస్తున్నారు. అసులు ముద్రగడ అంశంలో వాస్తవాలు, నిజాలు బయటకు రానీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు.
టెక్నాలజీ నా న్నేహితుడని చెప్పుకునే చంద్రబాబు.. తాను టెక్నికల్ గా బలహీనుడన్న సంకేతాలను బయటకు పంపేందుకు ఎందుకు కారణమవుతున్నాడు. మీడియా గోంతునోక్కి ప్రభుత్వం పత్రికా స్వేఛ్చను ఎందుకు హరిస్తుంది. ముద్రగడ పద్మనాభం అమరణ దీక్ష అంశాన్ని ఎందుకంతగా రాజకీయం చేస్తున్నారు. దీక్ష వార్తలను ప్రజలకు చేరకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం కాపులకు న్యాయం చేస్తుందని, కాపులకు తాను దైవం కన్నా అధికంగా చేస్తున్నానని చెప్పకనే చెప్పిన చంద్రబాబు కాపు సంఘాల నేత దీక్ష విషయంలో ఎందుకు జంకుతున్నారు. అసలు వాస్తవాలు ఏమిటీ.. బాబుగారెందు వాటిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.
చంద్రబాబును చూసిన వారెరైనా ఆయన నిఖచ్చి నిజాయితీ పరుడని ఇట్టే నమ్ముతారు. ఆయన మాటలు విన్నవారు మాత్రం గాందీజీ అంతటి గోప్పవారని అనుకుంటారు. అయితే ప్రజలకు చెప్పడానికి ఎన్ని సూత్రాలు, హితులు చెప్పినా.. తనదాకా వస్తే మాత్రం బాబుగారి నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. స్వర్గీయ అన్నగారిని గద్దె దింపిన ఆయన వారసులను వాడుకుని ఆరునెలల తరువాత ఒకరిని, ఆ తరువాత మరోకరిని ఇలా పార్టీకి దూరంగా జరిపి.. సానుభూతి పవనాలకు లక్ష్మీపార్వతిని దక్కకుండా చేసి చివరకు ఒంటరిని చేసే.. అమె రాజకీయ భవిష్యత్తునే కాలరాసి.. టీడీపీ పార్టీకి తానే నిజమైన వారసుడిని అని చాటిచెప్పుకునేంత వరకు.. తాజాగా నారా లోకేష్ కే పగ్గాలు అప్పజెప్పవరకు ఆయన రాజకీయ పర్వమంతా విమర్శల పర్వమే.
రాష్ట్ర విభజనకు పునాది బాబు లేఖ..
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసుపై అక్కస్సు వెళ్లగక్కిన చంద్రబాబు ఎందుకని రాష్ట్ర విభజనకు అంగీకరించారు. ఓ సారి మూడేళ్ల క్రితం రాజకీయాలను పరిశీలించిన క్రమంలో మనం అంతా అవగతం అవుతుంది. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు రెండో పర్యాయం పర్యటనకు వెళ్లి.. అవినీతిలో పీకల దాక మునిగిన వ్యక్తిపై సిబిఐ విచారణ జరుగుతుంది. సీబిఐ కేసులు నమోదు చేసింది. ఇక మరో నేత తానే గోప్ప అనుకునే చంద్రబాబుపై కూడా త్వరలోనే సిబిఐ విచారణ జరుగుతుంది.. ఆయన అక్రమ అస్థులు కూడా ప్రభుత్వ విచారణ జరుపుతుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని సంకేతాలను టీడీపీ ఇచ్చిందని అప్పటి కేంద్రమంత్రులు చెప్పినా.. వాటిని తిప్పి కోట్టని బాబు.. కేవలం ఎన్నికల ముందు మాత్రం కాంగ్రెస్ రాష్ట్ర విభజనతో ఏపీని అన్యాయం చేసిందని అరోపించారు.
అయితే తెలంగాణలో పర్యటనలో మాత్రం తాను రాష్ట్ర విభజనకు అనుకూలమని కేంద్రానికి స్పష్టంగా చెప్పామని, అంతేకాదు రాష్ట్రాన్ని విభజించేందుకు తన లేఖ దోహదం చేసిందని కూడా ప్రకటించుకున్నారు.
ఓటుకు నోటు కేసులో నిందుతులకు వత్తాసు..?
‘‘నా రాజకీయ జీవితం అంతా తరచిన పుస్తకం.. నిజాయితికి కట్టుబడి వున్నాం.. ఎవరికి లోంగాల్సిన పనిలేదు’’ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా.. స్వయంగా నారా చంద్రబాబే. ఓటుకు నోటు కేసు వెలుగుచూడటంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తరువాత కనీసం తెరపైకి కూడా వచ్చేందుకు ఇష్టపడని చంద్రబాబు.. ప్రభుత్వ సలహాదరు పరకాల ప్రభాకర్ చేత మీడియా కాన్ఫరెన్స్ పెట్టించి విషయాలను చెప్పించాడు. తన పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ ప్రభుత్వం కావాలనే కక్షగట్టిందని, అందుచేతే వారిని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులను బానాయిస్తుందని, అయినా తాము జంకబోమని అన్నారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి వీడియోలు మీడియాలో ప్రసారం అయినా.. బాబు గారు మాత్రం అదే స్టాండ్ పైన వున్నారు. వారం పది రోజుల తరువాత చంద్రబాబు మాట్లాడిన వీడియోలు బయటికి పోక్కగానే దానిని తెలివిగా తప్పించేందుకు ప్రయత్నం చేశారు. అదెలా అంటే మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులతో పాటు ఈ కేసులో కీలక నిందితుడైన జెరుసలేం ముత్తయ్య పిర్యాదుతో అనేక పోలిస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదుచేయించారు. అయితే ఇంత వరకు బాగానే వున్నా ఆ కేసులు ఎమయ్యాయి.? వాటి దర్యాప్తు ఎందుకు మధ్యలోనే అగింది..? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా..? అన్న విషయాలు మాత్రం ఇప్పటికే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసు..
అడపడచులకు అండగా వుండే ప్రభుత్వం కావాలంటే సైకిల్ గుర్తుకే ఓటేయమని ప్రచారం చేసుకున్న తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగానే అడపడుచులపై జరిగిన దాడులకు, పోయిన వారి ప్రాణాలపై నిదానంగా స్పందించింది. ఈ ఘటనలు జరిగిన తరువాత అవి చాలా చిన్న ఘటనలుగా ప్రభుత్వానికి కనబడినట్టు అనిపించింది. నాగార్జునా విశ్వవిద్యాలయంలో తొలి సంవత్సరం బీఆర్క చదువుతున్న విద్యార్థిని తన సీనియర్ విద్యార్థుల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు ఎంత సమయం తీసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రిన్సిఫాల్ బాబురావు ఏకంగా నెలల తరబడి హ్యాపీగా తిరిగేసి ఆ తరువాత తాపీగా అరెస్టు అయ్యాడు. ఈ కేసులో అసలు నిందితులు ఇంకా బయటే తిరుగుతున్నారని, వారందరినీ అరెస్టు చేయాలని రిషితేశ్వరి తండ్రి సహా అమె సహచర విద్యార్థులు పదే పదే అందోళనలు చేపట్టిన దరిమిలా గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచో, లేక ఎవరి నుంచి వత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఒకానోక సందర్భంలో రిషితేశ్వరి తండ్రి.. తాము ఏపి ప్రభుత్వం నుంచి తీసుకున్న పది లక్షల రూపాయలను కావాలంటే తిరిగి ఇచ్చేస్తామని, డబ్బులు తీసుకన్నంత మాత్రన కేసు విషయంలో ఎలాంటి ఉపసంహరణలు తీసుకోలేదని అన్నారు. ఎందుకనో ఆయనే చెప్పాలి.. ఎవరి నుంచి ఎలాంటి వత్తిడి వచ్చిందో అన్న విషయంలో మాత్రం ప్రభుత్వం మిన్నకుండిపోయింది.
వనజాక్షిపై దాడి కేసులు
ఇక మరో మహిళ విషయంలోనూ ఇలాంటి సర్ధుబాటే చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అమె మరెవరో కాదు స్వయంగా ఎమ్మార్వో వనజాక్షి. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా.. తాను సహించబోనని, ఎంతటి వారైనా తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతారని చెప్పుకోచ్చే చంద్రబాబు.. తమ ఎమ్మెల్యేలకు మాత్రం అన్నింటా మినహాయింపును కల్పించారు. ఇతరులు చేస్తే వ్యభిచారం.. తమ వాళ్లు చేస్తే శృంగారం అన్న రీతిలో తమ పార్టీకి చెందిన టీడీపీ నేతలు ఎన్ని తప్పులు చేసినా.. వాటిని వెనకోసుకోచ్చి వారు చేసింది న్యాయం అన్నట్లుగా వాదింపజేస్తారు. తమ వాళ్లు న్యాయానికి వెళ్లి అనవసరంగా ఇరుకుంటున్నారని కథనాలు ప్రచారంలోకి తీసుకోస్తారు టీడీపీ నేతలు. సరిగ్గా ఎమ్మార్వో వనజాక్షి విషయంలోనూ అలాగే జరిగింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వోపై దాడి చేయడం, దాంతో అమెతో పాటు రెవెన్యూ స్టాఫ్ అక్కడే బైఠాయించడం.. ఆ తరువాతి రోజు నుంచి రెవెన్యూ ఉద్యోగులందరూ విధులను బహిష్కరించడం.. ఇలా చకచకా జరిగిపోవడంతో గత్యంతరం లేక ఎమ్మార్వో వనజాక్షితో పాటు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నేతలను హైదరాబాద్ కు పిలిపించి వారి మధ్య రాజీ కుదర్చి పంపారు. ఆ తరువాత అసెంబ్లీలో ఈ అంశం చర్చకు రావడంతో ఎమ్మార్వో తన పరిధి దాటి అక్కడి వచ్చారని, అమె డ్వాక్రా మహిళలకు ఇసుకను ఇవ్వడం లేదన్న సమాచారంతో అక్కడికి వెళ్లి తాను నిలదీశానని అధికార పార్టీ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. మరి ఈ కేసులో వనజాక్షి ఎందుకు తనపై దాడి జరిగిందని చెప్పిందో.. ఎందుకని చంద్రబాబు ఈ ఘటనలో ఎంటర్ కావాల్సి వచ్చిందో..? నిజాలు ఏమిటన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే వుంది.
రాజధానిలో అక్రమ భూదందా..? రాసినవాడిపైనే కేసులు..?
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అమరావతిలో వేమూరి రవికుమార్, సుజనా చౌదరి, మురళీమోహన్, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర భూములు కొనుగోలు చేసిన అంశమై పత్రికలు వార్తలు రాస్తే అవును తమ పార్టీకి చెందిన నేతలు భూములు కోన్నారని అంగీకరిస్తూనే.. మీడియి రాసినంత మాత్రన విచారణ చేపట్టాలా..? అని ఎదురు ప్రశ్నించారు ఏసీ సీఎం చంద్రబాబు.. అదికార పార్టీకి చెందిన నేతలు అక్రమంగా భూములు కోన్నారని, భూదందాకు పాల్పడ్డారని అరోపణలు వచ్చాయి. అందులోనూ రాజధాని కోసం మినహాయించే భూములను కాకుండా ఇతర భూములనే ఎలా కోన్నారు. అంటే టీడీపీ నేతలకు ఎక్కడ రాజధాని వస్తుంది.. ఎక్కడి వరకు భూములను ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయం తెలిసిందా.. అన్న కథనాలు మీడియాలో ప్రచురితం అయ్యాయి. మీరు రాసినంత మాత్రన కడిగిన ముత్యం అని నిరూపించుకోవాలన్నది ఎక్కడా లేదని విచారణ జరిపించేది కూడా లేదన్నారు. అక్రమ దందాపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్న ఆయన.. ప్రభుత్వానికి అగ్నిపరీక్ష అక్కర్లేదని తేల్చేశారు.
అంతేకాదు ఈ విషయంలో వార్తలు రాసే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తామని, రాసేవాడికి.. నేరం చేసిన వాడికి చట్టం ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సమాచారం తెచ్చివ్వమంటేనే మీడియాకు భయం ఉంటుందని, అప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుని రాస్తారని విలేకరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. నిజం లేకపోతే చంద్రబాబుకు అంత ఉలికెందుకు, మీడియాపై నిప్పులు చెరగడమెందుకు..? ఇక ఈ సారి ఆయన పట్టుకున్న పదం రాజధాని బ్రాండ్ ఇమేజ్.. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో, వనజాక్షిపై దాడి కేసులో, గోదావరి పుష్కరాల తోక్కిసలాట పెను విషాదం జరిగినప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఎక్కడకి వెళ్లింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు భూమా నాగిరెడ్డిపై కేసులు పెట్టి, అయన అధికార పార్టీలోకి చేరగానే కేసుల విచారణ అటకెక్కిందన్న విమర్శలన నేపథ్యంలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ కు భంగం వాటిల్లిందో.. లేదో పార్టీ నేతలకే తెలియాలి. విదేశీ బ్యాంకుల నుంచి అప్పనంగా రుణాలను తీసుకుని ఎగవేత దారుడిగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తికి ఇటు కేంద్రమంత్రి పదవిని ఇప్పించడంతో పాటు మరోమారు పెద్దల సభకు ఎంపిక చేయడంలో నవ్యాంధ్ర బ్రాండ్ ఇమేజ్ కు భంగం వాటిల్లిందో లేదో వారికే తెలియాలి. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు కాకుండా పారిశ్రామిక వేత్తలను పెద్దల సభకు పంపితే పార్టీ క్యాడర్ కు బాబుగారిచ్చే సమాధానమేంటో.. దీంతో పార్టీ ఇమేజ్ కు డామేజ్ జరిగిందో..? లేదో పార్టీ శ్రేణులకే తెలియాలి.
గోదావరి పుష్కరాలలో 33 మంది మరణానికి బాధ్యత ఎవరిది..?
గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు స్నానాలను అచరించేందుకు పెద్ద సంఖ్యలో పోటెత్తిన భక్తులను నిలువరించి.. ఒక్కసారిగా వారిని వదిలడంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 33 మంది భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. పుష్కర వేళ గోదావరిలో స్నానం చేసి పితృతర్పణాలు అర్పిస్తే పితుృ దేవతలు శాంతిస్తారని, దీంతో తాము తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా హరిస్తాయని వస్తే.. తమ వారి ప్రాణాలనే హరించివేశాయని మృతుల బంధువులు శోకాలు మిన్నంటాయి. అయితే దీనికి కారణం ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సోమయాజులు కమీషన్ ముందు జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులను విచారించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంతేకాదు తోక్కిసలాటకు ఎవరూ బాధ్యులు కారని, కమిషన్ ముందు అధికారులను హాజరుపరచి విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. బాధితులెవరూ అఫిడవిట్లు దాఖలు చేయలేదని.. ఈ కేసుతో సంబంధం లేని వ్యక్తులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారని.. వారి వాదనలు పట్టించుకోనవసరం లేదని అన్నారు. అయితే వీఐపీ ఘాట్ వున్నా అక్కడ కుటుంబ సమేతంగా స్నానాలను అచరించి పూజా కార్యక్రమాలను నిర్వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అలా కాకుండా సాధారణ ఘాట్ లో గంటల తరబడి ఉండిపోయినందువల్లే తోక్కిసలాట జరిగిందని విపక్షాల నేతలు విమర్శించారు.
ఈ ఘటనలో రెండు రకాలుగా నివేదికలు సమర్పించిన ఘనత జిల్లా కలెక్టరుకు చెందుతుందని విమర్శలు గుప్పించారు. ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ఏ ప్రభుత్వ అధికారుల తప్పు లేదంటూ కలెక్టర్ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. ఇదే కలెక్టర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘాట్‌లో 2 గంటలపాటు ఉండిపోయినందువల్లనే తొక్కిసలాట జరిగినట్టు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అదే కలెక్టర్ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ఈ ఘటనలో ఏ అధికారి తప్పిదమూ లేదని నివేదిక ఇవ్వడమేమిటని తప్పుపట్టారు. ఒకే వ్యక్తి రెండు రకాలుగా ఎలా నివేదిక ఇస్తారని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల గొప్పతనం ప్రపంచానికి తెలిసేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ జియోగ్రఫీ ఛానల్, షార్ట్ ఫిల్మ్‌లను తీయడం, వాటికి ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించాడం.. దీని కారణంగా భక్తులను వదలకపోవడం.. ఒక్కసారిగా వదలండో ఈ పెను విషాదం జరిగిందని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరు నిజాలను తోక్కిపెట్టేందుకే ప్రభుత్వం అడించినట్లుగా అధికారులు అడుతున్నారన్న విమర్శలు వున్నాయి. పుష్కరాలపై షార్ట్ పిల్మ్ తీసింది నిజమా కాదా..? అసలు నేషనల్ జియోగ్రఫీ చానెల్ అక్కడెందుకు వచ్చింది. సినిమా షూటింగ్ లకు వినియోగించే భారీ క్రేన్లను అక్కడకు ఎవరి అనుమతితో తీసుకువచ్చారు. తెలుగు దర్శకుడు ఆ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించింది వాస్తవమా..? కాదా.? ఒకే ఘటనపై జిల్లా కలెక్టర్ రెండు నివేదికలు ఎలా సమర్పించారు..? ఇది నిజమా కాదా.. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు.. కానీ ప్రాణం పోతే ఎవరు తీసుకోస్తారు..? ఎవరు జీవం పోస్తారు. పుష్కారాలలో పోయిన 33 ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు..? ఎవరు ఈ మరణాలకు కారణం..? వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది..? కమీషన్లతో కాలయాపన చేస్తూ ఏడాది గడిచింది. కారణమైన వారిని ఎప్పటికి శిక్షిస్తారు..? అసలు శిక్షిస్తారా..? లేక ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు మాదిరిగా అటెకెక్కుతుందా..? అన్నది ప్రభుత్వానికే తెలియాలి.
అధికారం జనసేనాని పవన్ కల్యాణ్ పుణ్యమే.. అయినా విమర్శలు
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందుగానే కేంద్రంలో బీజేపి ప్రభుత్వం, నరేంద్రమోడీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజల అకాంక్ష మేరకు బీజేపి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రచారం నిర్వహించారు. ఆ తరుణంలో ఏపీలో మొత్తంగా రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. ముందస్తు నివేదికలు, సర్వేలను చేయించుకునే అలావాటు వున్న చంద్రబాబు తాము వెనుకబడ్డామని తెలియగానే ఏకంగా జనసేనాని సహాయం కోరారు. ముందుగా ఇందుకు బీజేపి నేతలతో రాయభారం పంపి.. ఆ తరువాత స్వయంగా ఆయనే పవన్ కల్యాన్ వద్దకు వెళ్లారు. బీజేపితో పాటు తమ పార్టీ తరపున కూడా ప్రచారం చేయాలని అర్థించారు. అందుకు అంగీకరించిన పవన్ కల్యాన్ సరేనని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో టీడీపీకి గ్రాఫ్ పెరిగింది. పవన్ కల్యాన్ అభిమానులు, అరాధించేవారు వారి కుటుంబసభ్యులతో టీడీపీకి లక్షల సంఖ్యలో ఓటు వేయించారు. అయినా టీడీపీ పార్టీ కేవలం ఐదు లక్షల పైచిలుకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది. అంటే పవన్ ప్రచారం చేయని పక్షంలో ఆ పార్టీ విపక్షంలో కూర్చుంటుందన్న విషయం వారికి తేటతెల్లమైంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంతో ఏపీ ఎంపీలు విఫలమయ్యారని.. వారు వ్యాపారాలకు పెద్ద పీట వేఃస్తూ.. ప్రత్యేక హోదాను పట్టించుకోలేదన్న నగ్నసత్యాన్ని నిలదీసారు పవన్. దీంతో అయనపైనా విమర్శలు కురిపించారు టీడీపీ నేతలు. గట్టు రాగానే తెప్ప కాల్చిన చందంగా అధికారం అందేవరకు పవన్ తమ నియోజకవర్గాల్లోకి రావాలని ప్రాధేయపడిన వాళ్లు అధికారం అందగానే గెలిపించిన వ్యక్తిపై విమర్శలకు దిగారు. ఇదేనా టీడీపీ నేతల బ్రాండ్ ఇమేజ్. ఇదేనా పార్టీ క్రమశిక్షణ. లొగ్గుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్లు పార్టీ నేతలకే ఈ లోగ్గుటు తెలియాలి.
ఇక ముద్రగడ పద్మనాభం అమరణ దీక్ష..
అధికారంలోకి వచ్చేంత వరకు కాపులను తమ పార్టీ కాపు కాయాలని చెప్పి.. వారికి ఎన్నోన్నో హామీలను గుప్పించిన టీడీపీ అధికారంలోకి రాగానే వాటిని నేరవేర్చకపోవడంతో కాపు హక్కుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అమరణ దీక్షకు పూనుకున్నారు. అంతకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూనే వచ్చారు. ఈ సందర్భంగా తునిలో కాపు గర్జన సభను కూడా నిర్వహించారు. దీంతో గుర్తు తెలియని అగంతకులు తుని రైల్వేస్టేషన్ల లో నిలచి వున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలును తగులబెట్టారు. ఈ సందర్భంలో తుని ఘటన దారుణమైనదని, ప్రశాంతతకు మారుపేరైన తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి విధ్వంసకాండ జరగడం మంచిది కాదని, ఇది ఎక్కడి నుంచో వచ్చిన వారి పనేనని మీడియా ముందు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు.
ఆ తరువాత ముద్రగడ తన నివాసంలో కాపు హక్కుల నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ అమరణ దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది, కాపు సంఘాల నేతలకు, ప్రభుత్వానికి మధ్య పలు ఒప్పందాలు కుదరిన నేపథ్యంలో ముద్రగడ దీక్షను విరమించారు. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు తుని ఘటనలో కాపు నేతలపై అక్రమ కేసులను పెట్టమని, నిజానిజాలను నిర్థారించిన తరువాతే కేసులు పెడతామని హామి ఇచ్చినట్లు ముద్రగడ సన్నిహితులు చెబతున్నారు. కానీ వాటిని విస్మరించిన ప్రభుత్వం ఏకంగా మాట మారుస్తూ.. తూగో జిల్లాకు చెందిన కాపు నేతలపైనే కేసులను పెట్టింది, అమలాపురం వన్ టౌన్ పోలిస్ స్టేషన్ లో కాపు నేతలపై కేసులు పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. కాపు కులస్థుల అరెస్టును నిరసిస్తూ ముద్రగడ పద్మనాభం పోలిస్ స్టేషన్ కు వెళ్లగా అయనను సిఐడీ అధికారుల వద్దకు తీసుకువెళ్తామని చెప్పిన అధికారులు ఆయనను కిర్లంపూడిలోని ఇంటికి వద్దకు తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజును గడువుగా ఇచ్చిన ముద్రగడ ప్రభుత్వం దిగిరాకపోవడంతో దీక్షను చేప్టట్టిన విషయం తెలిసిందే.
దీంతో కాపు సంఘాల నేతలు చంద్రబాబు సర్కార్ ను సందిస్తున్న ప్రశ్నలివే..
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more