రెచ్చిపోవద్దంటూనే పెద్దాయన నగ్న పోస్టులు పెట్టాడు | Markandey Katju posted nude links in twitter

Markandey katju posted nude links in twitter

Markandey Katju, Markandey Katju nude links, Markandey Katju twitter, Katju Provocative pictures, మార్కండేయ కట్జూ ట్విట్టర్, మార్కండేయ కట్జూ న్యూడ్ ఫోటోలు, ట్విట్టర్లో న్యూడ్ ఫోటోలు, కట్జూ ట్విట్టర్, తెలుగువార్తలు, తాజా వార్తలు, సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ట్విట్టర్, తెలుగు వార్తలు, latest news, national news

Markandey Katju posted nude links in twitter. “Provocative pictures are being shown on Social Media to hurt Muslim sentiments during Ramzan.”

రెచ్చిపోవద్దంటూనే పెద్దాయన నగ్న పోస్టులు పెట్టాడు

Posted: 06/10/2016 06:30 PM IST
Markandey katju posted nude links in twitter

మార్కండేయ కట్జూ ఈ పేరు వింటేనే మీడియా ఉలిక్కి పడుతుంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అయిన ఈ పెద్దాయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఎదురుచూస్తుంటుంది. అంతేకాదు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన ఈయన ఆ టైంలో మీడియాను ఓ ఆట ఆడుకున్నారు. అంతేనా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కత్తి లాంటి ఫిగర్ అని, ఆమె రాష్ట్రపతి అయితే బావుంటుందని పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు పలువురు మహిళా నేతలను ఉద్దేశించి అనేక సందర్భాలలో  స్పైసీ కామెంట్లు ఎన్నో చేశాడు. అలాంటాయన తాజాగా మరోసారి తనదైన శైలిలో వివాదంలోకి ఎక్కారు.

పవితమైన రంజాన్ మాసంలో ముస్లింలు అపవిత్రమైన పనులకు పాల్పడొద్దంటూ సంచలన వ్యాఖ్యలు రేపారు. సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దంటూ ముస్లింలను కోరారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ పేజీలో రాసి, విపులంగా ఆయా ఫోటోలతో కూడిన లింకును ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. ఒక మహిళ తన బురఖాను పక్కకు తీసి, వక్షోజాలు చూపిస్తూ నగ్నంగా కాబా పైన నిల్చున్న ఫొటో ఒకటి, ఇంకోటి ఇద్దరు అమ్మాయిలు పూర్తి నగ్నంగా బీచ్‌లో పడుకుని ఉన్నదానిని పోస్ట్ చేశారు. రెండోదానికి 'ఇది రంజాన్. బికినీలు వేసుకోవద్దు' అనే కేప్షన్ పెట్టారని కట్జు సవివరంగా తెలియజేశారు.

చివర్లో ట్విట్టర్‌లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ హెచ్చరించారు. అంతేకాదు ఇలాంటి ట్వీట్లు చూసి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకావద్దని ముస్లింలను ఆయన కోరారు. ఇలాంటివాటిని పట్టించుకోకుండా వదిలేయాలని, కావాలనే కొంతమంది రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుంటారని తెలిపారు. కాగా, వారుపెడితే పెట్టారు కానీ వాటిని మీరెందుకు చూశారు? చూస్తే చూశారు మళ్లీ దాన్ని రీపోస్ట్ ఎందుకు చేశారంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. దీంతో ఆయన వెంటనే ఆయా ఫోటోలను తొలగించారు. గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేసినందుకే ఫేస్ బుక్ లో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన కొద్దిరోజలు ఆయన  ఫేస్ బుక్ మొహం చూడలేదు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Markandey Katju  Katju nude links  MarkandeyKatju twitter  Provocative pictures  

Other Articles