11 మంది మగాళ్లను పెళ్లి చేసుకున్న పోటుగాడు | china man dressup like girl and cheated with marriages

China man dressup like girl and cheated with marriages

china man dressup like girl, china man 11 marriages, Miao Songtao 11 marriages, పదకొండు పెళ్లిళ్ల పోటుగాడు, చైనా నిత్య పెళ్లికొడుకు, తాజావార్తలు, తెలుగు వార్తలు, సోంగాటో, చైనా పెళ్లిళ్లు, latest news, china serial bride, bride as bridegroom, telugu news

china man dressup like girl and cheated with marriages.The 27-year-old, known as Miao Songtao, dressed as a woman and met men online before defrauding them in various means. The man's deception was brought to light after another man claimed he was dating the same woman who later disappeared with a large chunk of his cash.

11 మంది మగాళ్లను పెళ్లి చేసుకున్న పోటుగాడు

Posted: 06/10/2016 01:28 PM IST
China man dressup like girl and cheated with marriages

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. అలాంటిది మగాడు, మగాడు పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది. అలాగని గే వివాహ వ్యవస్థను మేమేం చులకన చేయట్లేదండీ బాబూ. ఆ అంశాన్ని పక్కన పెడితే ఇక్కడ మీరు చదవబోయేది కాస్త ప్ర్యతేకం. చైనాకు చెందిన మియావో సోంగాటో అనే 27 ఏళ్ల యువకుడు ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా మగవాళ్లనే. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇందుకోసం అతగాడు చేసిన చిలిపి పనేంటో తెలుసా? వేషం, గొంతు మార్చేసి అమ్మాయిల్లాగా గెటప్ లేసుకోవటం.

ఆన్ లైన్ లో హై ఫ్రోఫైల్ అబ్బాయిలను టార్గెట్ చేసిన సోంగాటో అమ్మాయిలాగా వారితో ఛాటింగ్ చేసేవాడు. మెల్లిగా అభిప్రాయాలు కలిశాక ఆడ గొంతుతో వారితో మాట్లాడేవాడంట కూడా. ఆపై లవ్ ప్రపోల్, డేటింగ్, చివరికి డేటింగ్ కూడా కానిచ్చాడంట. కానీ, ఎక్కడా ఆ పని జరగకుండా జాగ్రత్త పడ్డాడంట. ఇలా చివరికి ఆ పుంగవులతో పెళ్లి పీటలు ఎక్కి ఒక్కటి అయ్యేవాడు. ఇక కొత్త కాపురంలోకి అడుగుపెట్టిన సోంగాటో రెండో రోజో, మూడో రోజో వీలు చూసుకుని చేతికి దొరికిన డబ్బు, పెళ్లికి వచ్చిన గిఫ్ట్ లతో ఉడాయించేవాడు.

అలా వరుస పెళ్లిళ్లు చేసుకున్న ఈ అమ్మాయి కానీ అబ్బాయిని 11వ భర్త పోలీసులకు పట్టించేశాడు. సోంగాటో ఫ్లాట్ లో సోదా చేసిన పోలీసులకు వందల జతల మహిళల దుస్తులు దొరికాయంట. చివరికి మనోడు ఏరేంజ్ లో ఆ మొగుళ్లను నమ్మించాడంటే వాడిన లోదుస్తులు కూడా అమ్మాయిలవేనంట. జంబలకిడి పంబ అదిరింది కదా మన పోటుగాడి పెళ్లిళ్ల గాథ.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles