సోషల్ మీడియాను అవసరం మేర వాడుకోవాలే తప్ప అంతకు మించి వాడుకుంటే మాత్రం విపరీత అనార్థాలే వస్తాయి. ఇప్పుడున్న యువత మాత్రం దాన్ని మాగ్జిమమ్ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటుందనడంలో ఎలాంటి డౌట్ అక్కరలేదు. అలా తన ప్రేయసి నగ్న వీడియోను సోషల్ మీడియాలో అప్ చేశాడు ఓ వ్యక్తి. ఫలితం ఆమెను దూరం చేసుకోవటంతోపాటు, ఆ తప్పుకు కుమిలిపోతున్నాడు.
ఫ్లోరిడాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెస్లీ చాపెల్లో వైర్గ్రాస్ రాంచ్ హైస్కూల్లో చదివేది. తన తోటి విద్యార్థితోనే ఆమె ఏడాదిన్నర కాలంగా ప్రేమలో ఉంది. ఒకరోజు ఇంటికి ఆహ్వానించిన ఆ యువకుడు ఆ అమ్మాయి స్నానం చేస్తుండగా స్నేహితుల సహకారంతో రహాస్యంగా వీడియో తీశాడు. అంటితో ఆగకుండా దాన్ని స్నాప్చాట్లో పోస్ట్ చేశాడు. ఇక నగ్న వీడియో విషయం తెలిసిన ఆ అమ్మాయి మనస్థాపానికి గురైంది. తన తల్లి తుపాకీని తీసుకుని బాత్రూమ్కు వెళ్లి కాల్చుకుంది. కూతురు ఎంతసేపటికి బయటికి రాకపోవటంతో ఆమె తల్లి బాత్ రూమ్ డోర్ తెరిచేందుకు యత్నించింది. తలుపు కింద నుంచి రక్తపు మడుగు రాగా, పొరుగు వారి సాయంతో డోర్ బద్ధలు కొట్టి లోపలికి వెళ్లింది. కానీ, అప్పటికే ఆమె చనిపోయింది.
తన కూతురు స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడని, అది తెలిసి తన కూతురు మనోవేదనకు గురైందని ఆ తల్లి చెబుతోంది. ఈ విషయం తనకు కూడా చెప్పి చాలా బాధపడిందని తెలిపింది. తన కూతురుకు న్యాయం చేయాలంటూ ఆమె న్యాయపోరాటానికి దిగింది. కాగా, ఆమె బాయ్ ఫ్రెండ్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more