mudragada padmanabham and few followers arrest in kirlampudi

Cid police arrested mudragada pabmanabham

mudragada hunger strike, mudragada padmanabham, journalists, police restictions, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

CID police reached kirlampudi with tuni inncident warrants against Kapu caste leader Mudragada padmanbham arrested him amid his suporters protest

ITEMVIDEOS:ముద్రగడ అరెస్టు.. తలుపులు బద్దలు కోట్టిన పోలీసులు.. అడ్డుకున్న కార్యకర్తలు

Posted: 06/09/2016 05:02 PM IST
Cid police arrested mudragada pabmanabham

కాపు కులస్థులకు ఓట్లతో గద్దెనెక్కి.. వారి సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ.. తమ డిమాండ్లను తక్షణం అమలు చేయాలని అమరణ దీక్షను చేపట్టిన తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ అరెస్ట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాపు నేతలపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

ముద్రగడను బలవంతంగా మోసుకెళ్లి అంబులెన్స్ లో కూర్చోబెట్టిన పోలీసులు ముందస్తుగానే ఆయన నివాసం వద్ద పెద్ద స్థాయిలో పోలీసులను మోహరించారు. ముద్రగడ నివాసం వద్దనున్న కాపు కులస్థులను అక్కడి నుంచి ముందుగానే తరలించి ప్రణాళిక బద్దంగా అరెస్టు చేశారు. ముద్రగడను అరెస్టును నిరసించిన పలువరు కాపు కుల సంఘం నేతలను కూడా పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. సిఐడీ పోలీసులు వారెంట్లు చూపించడంతో ముద్రగడ మాత్రం అరెస్టును అడ్డుకోలేదు.

కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగం పెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బుధవారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించారు. చంద్రబాబు సర్కారు స్పందిచకపోవడంతో ఆయన దీక్షకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సుమారు ఐదువేల మంది పోలీసులను రంగంలోకి దింపింది. ముద్రగడ నివాసంలోకి మీడియాను కూడా అనుమతించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padma nabham  chandrababu naidu  arrest  police restictions  hunger strike  

Other Articles