CID police reached mudragada house with warrants

Cid police reached mudragada house with warrants

mudragada hunger strike, mudragada padmanabham, journalists, police restictions, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

CID police reached kirlampudi with tuni warrants against Kapu caste leader Mudragada padmanbham and may arrest him shortly

ముద్రగడ అరెస్టుకు రంగం సిద్దం.. వారెంట్లతో కిర్లంపూడికి చేరిన సిఐడీ..

Posted: 06/09/2016 01:36 PM IST
Cid police reached mudragada house with warrants

కాపులను వెనుకబడిన తరగతులలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అమరణ దీక్షను చేపట్టిన తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు రంగం సిద్దమైంది. తుని ఘటనలో మాత్రమే తాను అరెస్టు అవుతానని, అమలాపురం కేసులో అరెస్టు కానని తేల్చిచెప్పిన ముద్రగడ డిమాండ్ మేరకు సీఐడీ పోలీసులు రంగప్రవేశం చేశారు. తుని ఘటనకు సంబంధించిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం కేసులో ఆయనపై వారెంట్లను కూడీ చేత బట్టుకుని సిఐడీ అధికారులు అక్కడకు చేరుకున్నారు.

తుని కేసును విచారిస్తున్న సిబిసిఐడీ అధికారులు వస్తేనే తాను అరెస్టు అవుతానని ఇవాళ ఉదయం స్తానిక పోలీసులకు ముద్రగడ చెప్పారు. తనను అరెస్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరంటూ ఆయన విరుచుకుపడ్డారు. తనను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆయన హెచ్చరించారు. తుని ఘటనలో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తేనే తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పారు.

దీంతో పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు అరెస్ట్ వారెంట్లు చేతబట్టుకుని సీఐడీ పోలీసులు కిర్లంపూడి చేరుకున్నారు. మరికాసేపట్లోనే వారు ముద్రగడను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు సమాచారం. ఆయన గత రెండేళ్లుగా చేస్తున్న డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం.. ఇవాళ ఉదయం చేసిన డిమాండ్ ను మాత్రం హుటాహుటిన నెరవేర్చారు. తుని ఘటనలోనే అయనను మరికోద్ది సేపట్లో అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles