మోదీ క్రేజ్ కు దెబ్బేసిన ఎలిజబెత్ | no selfies with PM Modi during washington tour

No selfies with pm modi during washington tour

PM Modi, no selfies, modi washingtontour, Elizabeth Heng modi, modi no selfie, మోదీతో సెల్ఫీ లేదు, అమెరికా కాంగ్రెస్ లో నో సెల్ఫీ, ఎలిజబెత్ హెంగ్, మోదీ వాషింగ్టన్, తాజా వార్తలు, మోదీ వార్తలు, తెలుగు వార్తలు, latest news, modi news, telugu news

No selfie with PM Modi during washington tour. should not take any selfies with PM Modi, House protocol expert Elizabeth Heng ordered. "First and foremost - NO SELFIES!! Taking selfies with a visiting Head of State is incredibly inappropriate and tactless," Elizabeth Heng, protocol aide in the House Foreign Affairs Committee, said in her message.

మోదీ క్రేజ్ కు దెబ్బేసిన ఎలిజబెత్

Posted: 06/09/2016 01:35 PM IST
No selfies with pm modi during washington tour

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. పథకాలు, పాలనాపరంగానే కాదు అవసరమైతే ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మరీ ప్రజలతో మమేకయిపోతారు. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా ఆయన ఎక్కడికి వెళ్లినా సరే జనాలు ఎగబడిపోతుంటారు. ఏదో సెలబ్రిటీలతో ఫోటోలు దిగినట్లు సెల్ఫీలు లాగించేస్తారు. సెల్ఫీలంటే అమితంగా ఇష్టపడే మోదీ కూడా వారి ఉత్సాహాన్ని అర్థం చేసుకుని అందుకు బాగా కోపరేట్ చేస్తుంటారు.  దీంతో ఆయన ఎక్కడికెళ్లినా సెల్ఫీల జోరు తప్పనిసరిగా మారింది.  

అలాంటిది ప్రస్తుత మోదీ అమెరికా పర్యటన మాత్రం అందుకు విరుద్ధంగా మారింది. ఒక్కటంటే ఒక్క సెల్ఫీ లేకుండానే బుధవారం ఆయన పర్యటన కొనసాగింది. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన అక్కడి నేతలను కట్టిపడేశారు. ఆ ప్రసంగానికి ముగ్ధులైన అమెరికా పార్లమెంటు సభ్యులు హర్షధ్వానాలు తెలిపారు. ప్రసంగం కాగానే మోదీతో కరచాలనాలకు, ఆటోగ్రాఫ్ లకు ఎగబడ్డారు. అయితే ఏ ఒక్కరు కూడా మోదీతో సెల్ఫీ దిగడానికి సాహసించలేదు.  దీనికి కారణం ఓ మహిళా అధికారి అంటే మీరు నమ్ముతారా?

ఎందుకంటే సభకు విచ్చేసే విదేశీ అధినేతను సెల్ఫీలతో ఇబ్బందుల పాలు చేయొద్దని అక్కడి చట్టంలో ఉందట. ఈ విషయాన్ని ఉటంకిస్తూ... ప్రోటోకాల్ చీఫ్ ఎలిజబెత్ హెంగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు సడలింపు ఇస్తామన్నప్పటికీ ఆమె దానికి ససేమిరా అందట. ‘‘ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్... నో సెల్ఫీస్’’ అంటూ ఆమె జారీ చేసిన ఆదేశాలతోనే సెల్ఫీ దిగాలన్న కోరికను మనసులోనే చంపేసుకున్నారంట అక్కడి నేతలు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  no selfies  modi washingtontour  Elizabeth Heng modi  modi no selfie  

Other Articles