Former Secret Service Agent's Book Blasts Hillary Clinton

Hillary clinton gave bill a black eye in the white house

Bill Clinton, Crisis of Character, Gary J Byrne, Hillary Clinton, Monica Lewinsky, US president, ex secret service officer, hillary volcanic temper, hillaray lacks integrity, hillary unable to serve office, Virgin Islands, celebrations, Donald Trump, Sanders

Hillary Clinton has a "volcanic" temper and a loud fight she had with Bill Clinton in 1995 left the then US President with a black eye, an ex-Secret Service officer has claimed in a 'tell-all' book.

అమెరికాలో సంచలనం రేపుతున్న పుస్తకం..

Posted: 06/08/2016 08:52 AM IST
Hillary clinton gave bill a black eye in the white house

అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల బరిలో హిల్లరీ క్లింటన్ సరికొత్త రికార్డుకు నెలకోల్పుతున్న తరుణంలో అమెకు సంబంధించిన పలు రహస్య అంశాలను బట్టబయలు చేస్తున్న పుస్తకం కూడా అమెరికాలో సంచలనం చేస్తుంది. అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండేందుకు 2,383 మంది డెలిగేట్లు, సూపర్ డెలిగేట్ల మద్దతుండాలి. అయితే.. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీల్లో హిల్లరీకి 1,812 మంది డెలిగేట్లు, రెండో స్థానంలో ఉన్న శాండర్స్‌కు 1,521 మంది మద్దతు తెలిపారు. అధ్యక్ష బరిలో నిలిచేవారి అభ్యర్థిత్వం ఖరారు చేయటంలో కీలకంగా మారిన మొత్తం 714 సూపర్ డెలిగేట్లలో 571 మంది హిల్లరీవైపు ఉన్నారని దీంతో అమె అధ్యక్ష రేసులో బరిలో నిలుస్తారని సమాచారం.
 
అయితే ఇదే సమయంలో హిల్లరీపై విమర్శలతో కూడిన తాజా పుస్తకం సంచలనం రేపుతోంది. హీల్లరీ క్లింటన్ ను సీక్రెట్ సర్వీసెస్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అమెను చాలా దెగ్గరగా పరిశీలించానని, అమెలోని కట్టలు తెంచుకునే కోపం, అమె టెంపర్ మెంట్ అమెరికా అధ్యక్ష పదవికి అనర్హురాలని చెప్పుకోచ్చాడు. హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో అమె ఏకంగా భర్తపై దాడి చేశారని కూడా ఆయన తన పుస్తకంలో పేర్కోన్నాడు.

ఈ నెల 28న విడుదల కానున్న ‘క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్’ అనే ఈ పుస్తకంలో వైట్‌హౌస్ మాజీ సీక్రెట్ సర్వీస్ అధికారి గ్యారీ జే బయర్న్ కొన్ని ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. 1995 వేసవిలో బిల్ క్లింటన్‌తో హిల్లరీ తీవ్ర ఆగ్రహంతో పెద్దగా గొడవ పడ్డారని, ఫ్లవర్ వాజ్ భారీ శబ్దంతో పగలడం వినిపించిందని పుస్తకంలో పేర్కొన్నారు. తర్వాతి రోజు కంటి చుట్టూ నల్లని వలయంతో కూడిన గాయంతో బిల్ కనిపించారని, అయితే క్లింటన్‌కు కాఫీ అంటే అలర్జీ ఉండ టంతో కంటికి సమస్య వచ్చిదంటూ వ్యక్తిగత పర్యవేక్షకురాలు చెప్పారన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gary J Byrne  hillary clinton  bill clinton  US president  ex secret service officer  

Other Articles