kapu leaders arrest leads to high tension in amalapuram

High tension prevails in amalpuram

mudragada padmanabham, ratnagiri express, cid asp damodhar, arrests, amalapuram, tuni, pawan kalyan, ys jagan, anantapur, andhra pradesh, kapu leader, ys jagan mohan reddy, chandrababu naidu, tdp election promise, ap government,

high tension prevails in amalapuram as cid arrests ten kapu leaders in ratnagiri express fire accident case.

అమలాపురంలో హైటెన్షన్.. రాజుకుంటున్న ‘రత్నాచల్’ కేసు..

Posted: 06/07/2016 10:27 AM IST
High tension prevails in amalpuram

అంధ్రప్రదేశ్ లో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన కోనసీమలో హైటెన్షన్ నెలకొంది. కాపు గర్జన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. మళ్లీ కాపు నేతలను టార్గెట్ చేసింది. ఇటీవల కాపు గర్జన సందర్భంగా జరిగిన రైలు దహనం కేసులో నిందితులుగా భావించిన పది మంది కాపు నేతలను అదుపులోకి తీసుకుని అమలాపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో విషయం దవాణంలా వ్యాపించడంతో కాపు నేతలు, కార్యకర్తలు, కులస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.

అమలాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న కాపు నేతలు అడ్డుకునేందుకు స్థానికంగా 14 ప్రాంతాలలో పోలీసులు పికెట్ లను ఏర్పాటు చేశారు. అయినా పోలీసులను తప్పించుకుని, కాపు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. దీంతో నిత్యం ప్రశాంతంగా కనిపించే అమలాపురంలో ఒక్కసారిగా మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకోంది. కాపు గర్జన సభ తరువాత స్తానిక రైల్వే స్టేషన్ వద్ద నిలిపివున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొందరు అగంతకులు నిప్పుపెట్టారు. అయితే కాపు కార్యకర్తలే నిప్పు పెట్టారని అప్పట్లో ప్రభుత్వం, మంత్రులు అరోపించారు. దీంతో ఈ కేసులో అరెస్టులకు పోలీసులు పూనుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది

అరెస్టుల సమాచారం అందుకున్న కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం.. అమలాపురం వన్ టౌన్ పొలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అరెస్టు చేసిన కాపు కార్యకర్తలను బేషరుతా వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. కాపు గర్జన సభ నిర్వహించిన నేపథ్యంలో సభకు కర్త, కర్మ, క్రియ అంతా తానేనని, తననే ముందుగా అరెస్టు చేయాలని స్టేషన్ ముందు భీష్మించుకుని కూర్చున్నారు. ముందుగా వేదికమీద వున్న నేతలను అరెస్టు చేయండి అ తరువాత కార్యకర్తల జోలికి వెళ్లండని ఆయన సూచించారు.

ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు సర్కార్ నేరవేర్చడం లేదని ఉవ్వెత్తున్న నిర్వహించిన కాపు గర్జన సభకు లక్షాలాది మంది కాపులు తరలివచ్చారని, అయితే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగులబెట్టిన వారెవరో సమయం వచ్చినప్పుడు తాను బయటపెడతానని చెప్పారు. తనను కాపు గర్జన పెట్టమని అనాడు ప్రోత్సహించిన వారే ఇవాళ చంద్రబాబు అండతో తనను తిడుతున్నారని పద్మనాభం అన్నారు. అమాయక కాపు యువకులను విడుదల చేసే వరకు స్టేషన్ లోనే బైఠాయిస్తానని ముద్రగడ హెచ్చరించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : mudragada padmanabham  ratnagiri express  cid asp damodhar  arrests  amalapuram  tuni  

Other Articles