rape attempt on girl settled for Rs. 1.7 lakh

Sexual attempt on minor girl settled for cash

sexuall assault on minor girl, minor girl sexually assaulted in chintakuntla, minor girl sexually assaulted in devarakonda, minor girl sexually assaulted in nalgaonda district, minor girl sexually assaulted in Telangana, sexual assault, molestation, minor girl, devarakonda, chintakuntla, nalgonda, police, crime

A sexuall assult in devarakonda of nalgaonda district in Telangana has been allegedly settled for Rs !.7 lakh by local leaders

బాలికపై అత్యాచార యత్నం.. ఖరీదుగట్టిన పెద్దలు..

Posted: 06/07/2016 07:05 AM IST
Sexual attempt on minor girl settled for cash

పల్లెటూర్లు ప్రగతికి పట్టుగోమ్మలని అంటారు. అంతేకాదు భారత సంస్కృతి, సంప్రదాయానికి సజీవ నిలయాలు అంటారు. గ్రామాల్లో తమ పక్కింటివారిని కూడా వరుసలతో పిలిచి ఓ బంధాన్ని ఏర్పర్చుకుంటారు. అలాంటి పల్లెటూర్లో ఓ బాలిక శీలానికి పెద్దలు వెలకట్టారు. పెద్దలు, బంధువులు అందరి సమక్షంలో ఆ బాలికనే నిందితురాలిగా మార్చి, అమె బాధను అరణ్య రోదనగా మార్చేశారు. అమెను, అమెకు జరిగిన అన్యాయాన్ని, ఎవరూ పట్టించుకోకుండా తీర్పు చెప్పి.. విషయాన్ని గోప్యంగా వుంచేందుకు నిర్ణయించారు.

తమ గ్రామానికి చెందిన ఓ మగమృగం అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై పైశాచికత్వంతో కన్నుమిన్ను కానక అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడం.. బంధువులు రాకను గమనించి  అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు.. పెద్ద మనుషులను ఆశ్రయిస్తే విషయం బయటికి పొక్కకుండా బాలిక శీలానికి వెలకట్టారు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు.. వివరాలు ఇలా వున్నాయి.. దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామపంచాయతీ పరిధి దేశ్‌ముఖోనికుంటకు చెందిన ఓ బాలిక గ్రామ సమీపంలోని తమ వ్యవసాయ పొలం వద్దకు మధ్యాహ్నం వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెను చింతకుంట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెబుతూనే లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బంధువులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు అతను పరారయ్యాడు. ఈ విషయాన్ని బాలిక తరఫు బంధువులు పలువురు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పంచాయితీ నిర్వహించి సుమారు రూ.లక్షా 70 వేలు ఇవ్వాలని చెప్పారు.

అయితే నిందితుడు పైశాచిక మృగంలా తెగబడినా.. కేవలం డబ్బుతో జరిగిన తప్పుకు శిక్షను విధించారు పెద్దలు. భవిష్యత్తులో డబ్బు అధికంగా వచ్చిన నేపథ్యంలో మళ్లీ అ బాధితురాలిపై అత్యాచారానికి తెగబడి బాలిక శీలానికి వెలకడితే.. ఎవరు బాద్యులు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దారుణమైన నేరాలకు డబ్బుతో శిక్షను విధించడం ఏంత వరకు సమంజసమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. దేవరకొండ పోలీసులను వివరణ కోరగా తమకెలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual assault  molestation  minor girl  devarakonda  chintakuntla  nalgonda  police  crime  

Other Articles