పీఎం కాదు ఎంపీ కావాలనుంది | nitish kumar says he never want to became PM

Nitish kumar says he never want to became pm

Nitish Kumar, not PM only MP, nitish desire as MP, nitish wants MP, Bihar Chief Minister, బీహార్ ముఖ్యమంత్రి, నితీశ్ కుమార్, పీఎం కాదు ఎంపీ, రాజకీయాలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news, telugu varthalu, national politics, political news

Amid speculations over Nitish Kumar becoming a prime ministerial candidate by a non-BJP front in the next general elections, the Bihar Chief Minister today said he only desired to become an MP and did not nourish a dream to become a PM.

పీఎం కాదు ఎంపీ కావాలనుంది

Posted: 06/06/2016 06:08 PM IST
Nitish kumar says he never want to became pm

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే.  అసలు బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే వీరి మధ్య వైరం మరింత పెరిగింది. ప్రధాని పీఠంపై కన్నేసి తనను ప్రకటిస్తారని ఆశించి భంగపడ్డ నితీశ్  17 ఏళ్ల మైత్రిని కాలరాసి మరీ కమలంతో బంధాన్ని తెంచేసుకున్నారు. ఆపై బీహార్ రాజకీయాల్లో రేగిన కలకలం, మాజీ సీఎం మాంఝీకి బీజేపీ సపోర్ట్ ఇవ్వటం, మహాకూటమి సాయంతో తిరిగి నితీశ్ సీఎం కావటం ఎరుకే. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో నాన్-బీజేపీ ఫ్రంట్ తరపున ప్రధాని అభ్యర్థి నితీశ్ కుమార్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
 
దీంతో ప్రస్తుతం నితీశ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాను ఒకప్పుడు ఎంపీ కావాలని కోరుకునేవాడినే తప్పా, ప్రధాన మంత్రి(పీఎం) కావాలనే ఆలోచన తనకు ఎన్నడూ రాలేదని చెబుతున్నాడు. ‘నా జీవితంలో కనీసం ఒకసారైనా ఎంపీ కావాలనుకున్నా. మంత్రి కావాలని, ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి కావాలనే కలలు మాత్రం కనలేదు’ అని ఒక కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్ వ్యాఖ్యానించాడు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను పీఎం అభ్యర్థినంటూ కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ తనకు అపకీర్తి తెచ్చేలా చేస్తున్నారని అంటున్నాడు. ప్లాష్ బ్యాక్ ఓ కట్ వేసుకుంటే అప్పుడు అలిగి ఎన్డీయే నుంచి బయటికి వచ్చింది ఎంపీ కోసమా? పీఎం కోసమా? అన్నది గుర్తుచేసుకుంటే మంచిదేమో! మరి ఈ లెక్కన సీఎం పదవిని తృణప్రాయంగా వదిలేసి తన చిరకాల వాంఛ కోసం వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీచేస్తారా? చూద్దాం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  not PM only MP  nitish desire as MP  Bihar Chief Minister  

Other Articles