ఓవైపు ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలమవుతున్నాడంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనవసరమైన మాటలతో నోరు జారి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నాడు ప్రతిపక్ష నేత జగన్. సీఎంను చెప్పులు, చీపుర్లతో కొట్టాలడం దారుణమంటూ అన్ని పార్టీలు జగన్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి నీచపు మాటలు మాట్లాడకుండా మహిళలు జగన్కు గంటెలతో వాతలు పెట్టాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కోరుతున్నారు. అయితే ఇంత పరుషమైన పదజాలం వాడుతున్న అవేం పట్టించుకోకుండా అభివృద్ధి పనుల్లో నిమగ్నైపోయారు సీఎం చంద్రబాబు. కానీ, ఆదివారం విజయవాడలో జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ లాంటి వాడు గ్రామానికి ఒకడుంటే దేశం సర్వనాశనమైపోద్దంటూ ఘాటైన పదజాలం వాడారు. ఇక సోమవారం అదే రీతిలో మరోసారి స్పందించారు.
అమరావతి పనుల సమీక్షకు వచ్చిన ఆయన్ని మీడియా ఈ వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఈసారి కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అనుభవమంత వయసు లేని జగన్ తనకు పెను సమస్యగా, పెద్ద తలనొప్పిగా పరిణమించారంటూ స్పందించారు. ‘‘సీఎం పదవిలో ఉన్న వ్యక్తికే జగన్ సవాల్ విసురుతాడా? జగన్ వయసు నా రాజకీయ అనుభవమంత లేదు. రాజకీయాల్లో హుందాతనం అవసరం. వైఎస్ సహా ఎంతోమందిని చూశా. కానీ జగన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలు నాకు ఎప్పుడు ఎదురు కాలేదు’’ అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలను జగన్ విజ్ణతకే వదిలేస్తున్నానంటూ తెలిపారు. నోటికొచ్చినట్లు మాట్లాడమే రాజకీయమనకుంటే పొరపాటు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం దొరికినప్పుడు వాళ్లే తగిన బుద్ధి చెప్తారంటూ తెలిపారు. రాజకీయాల పరంగా ప్రభుత్వాన్ని ఏరకంగానూ ఇబ్బందిపెట్టని జగన్ వ్యక్తిగత విమర్శలతో మాత్రం చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడన్న మాట.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more