ఆ డాక్టర్ ఒక పిల్లల మిషన్ | Pakistani man wants to have 100 children

Pakistani man wants to have 100 children

Jan Mohammad, Pakistan, 35 children, target for 100 children, పాకిస్తాన్, వందమంది పిల్లలు, జాన్ మహ్మద్ ఖిల్జీ, తాజావార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

Meet 43-year-old Jan Mohammad from Pakistan, a doctor by profession, who is already a father of 35 children and is steadfast to fulfill his goal of having 100 children. He strongly believes that fathering 100 children will ensure a spot for him in heaven, and he's already a third of the way there. Sardar Jan Mohammad Khilji already has three wives and is on the look out for the fourth.

ITEMVIDEOS: ఆ డాక్టర్ ఒక పిల్లల మిషన్

Posted: 06/04/2016 12:35 PM IST
Pakistani man wants to have 100 children

ఓవైపు జనాభా పెరిగిపోతుందని కంగారు పడుతుంటే అతనో డాక్టర్ అయి ఉండి అదే పనిగా పెట్టుకున్నాడు.  ఇస్లాంలో ఉన్న బహుభార్యత్వాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఒకరిద్దరితోనే వేగలేని ఈ రోజుల్లో ఏకంగా 35 మందిని కనేశాడు. ఏదో ఘనకార్యం సాధించినట్లు ఉబ్బితబ్బిబి అయిపోతున్నాడు. ఈ బ్యాటింగ్ ఇంతటితో ఆపడంట. ఏకంగా వంద మందిని కనడమే తన లక్ష్యమంటూ వీర శపథాలు చేసేస్తున్నాడు. ఇంతకీ ఇందతా ఎందుకయ్యా అంటే... ఆ వందమంది తనను పున్నామ – నరకం నుంచి తప్పిస్తారని నమ్మకమంట.

పాకిస్థాన్ కు చెందిన సర్దార్ జాన్ మహ్మద్ ఖిల్జీ ఓ డాకర్ట్. వయసు 46 ఏళ్లు. వీలైనంత ఎక్కువ సంతానం కనడం పనిగా పెట్టుకున్నాడు. అదో పవిత్రకార్యమని అతగాడి ఉద్దేశం. ముగ్గురు భార్యల ద్వారా ఇప్పటికే 35 మందిని కన్నాడు. తనకు 26 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు మొదటి వివాహం చేశారని, మరుసటి ఏడాదిలో కేవలం ఐదు నెలలో గ్యాప్ లో ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని తెలిపాడు. అందులో ఒకటి సోషల్ మీడియా  పరిచయం ద్వారా జరగటం విశేషం. కాగా, పాకిస్థాన్లో బహుభార్యత్వం తప్పుకాదు. ఇస్లాం ప్రకారం.. పురుషులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.

అయితే అంత మందితో సమస్యలు రావటం లేదా? అని అడిగితే... అల్లా దయతో చాలా సంతోషంగా ఉన్నానని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏం లేవని చెబుతున్నాడు. అయితే సరదాగా ఎప్పుడైనా బయటికి వెళ్దామన్నా లేదా పంక్షన్లకు హాజరవుదామన్న అంత మందిని మోసుకెళ్లడం మాత్రం చాలా ఇబ్బందిగా ఉందనంటున్నాడు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదని సెంచరీ కనేదాకా విశ్రమించేది లేదని ఖరాఖండిగా చెబుతున్నాడు. ఆయనగారి వెర్రికి భార్యలు కూడా మద్ధతు తెలిపారు. అందుకోసం మరో పెళ్లి చేసేందుకు వారు సిద్ధమయ్యారు. బహుభార్యత్వం మంచిది కాదని, నిత్యం గొడవలు జరుగొచ్చని, అంతేకాదు తండ్రికి పిల్లలు ఎవరు ఏంటో తెలీక సంబంధాలు దెబ్బతింటాయని అతడికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.  అయినా అవేం చెవికెక్కని జాన్ ప్రస్తుతానికి వారంతా వధువు వేటలో బిజీ అయ్యారు.
 
బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jan Mohammad  Pakistan  35 children  target for 100 children  

Other Articles