మన పాటల్ని బాగా వాడేసుకుంటున్నారు | Bollywood music ultimate weapon for ISIS

Bollywood music ultimate weapon for isis

bollywood music, libya, ISIS, british Army, latest news, బాలీవుడ్ సంగీతం, ఐఎస్ ఉగ్రవాదులు, డైలీ మిర్రర్, బ్రిటీష్ సైన్యం, telugu news

Bollywood music ultimate weapon for ISIS. Not everyone enjoys Bollywood music, it seems. British commandos have been blasting songs from the Hindi film industry at ISIS fighters in Libya to 'freak them out', British media reported. The Special Forces troops came up with the idea after a Pakistani-born intelligence officer with the British Army said Bollywood tunes would really annoy ISIS, Britain's Daily Mirror said.

మన పాటల్ని బాగా వాడేసుకుంటున్నారు

Posted: 06/02/2016 04:15 PM IST
Bollywood music ultimate weapon for isis

లిబియా ఉత్తర ఆఫ్రికాలోని ఓ ముస్లిం దేశం. ఏళ్లపాటు బానిస బతుకును అనుభవించిన ఈ ఎడారి ప్రాంతంలో ఆ తర్వాత నియంతృత్వ పాలన విరజిల్లింది. అయితే గఢాఫీ మరణానంతరం స్వేచ్ఛ పవనాలు వీచాయనుకుంటున్న ఈ దేశంలో ప్రస్తుతం ఉగ్రరాక్షస గణం ఐఎస్ ఐఎస్ రాజ్యమేలుతుంది. దీంతో రంగంలోకి దిగిన బ్రిటిష్ సైన్యం వారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఐఎస్ చాటుగా దెబ్బలు తీస్తుండటంతో సగం సైన్యం ఇప్పటికే ఖాళీ అయ్యింది. దీంతో ఉగ్రవాదులను ఎరివేసేందుకు సైనిక దళాలు సరికొత్త ఫ్లాన్ ను అమలు చేస్తున్నాయి. ఈ విషయాలన్నింటిని డైలీ మిర్రర్ ప్రముఖంగా ప్రచురించింది.

ప్రస్తుతం అక్కడి ఎడారుల్లో బాలీవుడ్ హిట్‌సాంగ్స్ తో మార్మోగుతుంది. సంగీతం అంటే ఇస్లాం వ్యతిరేకమని ఐఎస్ నమ్మకం. పైగా హిందీ పాటలంటే వారికి చెప్పలేనంత మంట. దీంతో బ్రిటీష్ సైన్యం పాటలు ప్లే చేసి వారిని ఉడికిస్తున్నారు. రెచ్చిపోయి బయటికి వస్తున్న వారిని పిట్లల కాల్చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇలా 180 మందిని చంపినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. పాక్ సంతతికి చెందిన ఓ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఈ సలహా ఇవ్వగా, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తరాఖండ్ లో రైతులు పోలాల్లో అడవి పందులను తరిమేందుకు హనీసింగ్ పాటలు పెట్టిన సంగతి తెలిసిందే. అలా మన పాటల్ని ఎవరు పడితే వారు, ఎవరికి కావాల్సినట్లు వారు వాడేసుకుంటున్నారన్న మాట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood music  libya  ISIS  british Army  latest news  telugu news  

Other Articles