Arnold Schwarzenegger records terrifying moment he's charged by elephant

Arnold schwarzenegger charged by elephant

Arnold Schwarzenegger films elephant charge, elephant charges Arnold Schwarzenegger vehicle. Arnold Schwarzenegger south africa, Arnold Schwarzenegger safari park, Entertainment, Animals, World, news, video, latest,

This amazing footage shows the moment action hero Arnold Schwarzenegger comes face to face with a huge African elephant.

ITEMVIDEOS: హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ ను తరిమింది..

Posted: 06/01/2016 09:29 PM IST
Arnold schwarzenegger charged by elephant

ఉక్కు మనిషిలాగా టర్మినేటర్ వంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ హీరో, ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ కు ఓ గజరాజు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జీపులో వెళుతున్న వారికి అనూహ్యంగా ఎదురుపడి భయంతో వణికిపోయేలా చేసింది. అంతేకాదు వారి వాహనాన్ని వెంబడించి ఇక చచ్చాం రా దేవుడా అనుకునేలా చేసింది. అంతేకాదు.. ఈ సంఘటన తర్వాత ఆ బృందంలో కొంతమంది తమ ప్యాంట్లు కూడా మార్చుకున్నారంట. పూర్తి వివరాల్లోకి వెళితే ఆర్నాల్డ్ తన మిత్రులతో సౌత్ ఆఫ్రికాలోని సఫారీ పార్క్కి వెళ్లాడు. అలా రహదారిపై వెళుతున్న వారికి అనూహ్యంగా ఓ ఏనుగు తారసపడటంతో తమ వాహనాన్ని ఆపేశారు.

అయితే, రోడ్డు దాటి వెళ్లకుండా భారీ పొడవైన దంతాలతో ఉన్న ఆ ఏనుగు వారిని సమీపించింది. దాంతో అందులోని వారంతా కుక్కిన పేనులాగా కదలకుండా కూర్చున్నారు. అది కాసేపు తొండంతో ఆ వాహనాన్ని తడిమి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్లింది. అప్పటికీ వారు అలాగే తమ శ్వాసను కాసేపు ఆపేసి సింహంలా మీదకు దూకుతుందా అని భయంతో చూస్తున్నారు. అయితే, ఆ ఏనుగు పక్కకు వెళ్లింది. అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆర్నాల్డ్ మాత్రం దాని ఆలోచనను ముందే పసిగట్టాడు. అది తమపై దాడి చేసేందుకు వస్తుందని చెప్పాడు. నిజంగానే ఆ ఏనుగు అన్నంత పనిచేసింది.

వేగంగా వారి కారువైపు వెనుక నుంచి దూసుకొచ్చింది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి సచ్చాం బాబోయ్ అన్నట్లు కారు ఎంత వేగంతో ఎక్స్ లేటర్ తొక్కి పోనిచ్చాడు. అప్పటికీ ఏనుగు కూడా గుర్రం మాదిరిగా తన పరుగును పెంచింది. అదృష్టవశాత్తు వారు అలా ఏనుగు నుంచి తప్పించుకున్నారు. ఈ అనుభవాన్ని చూసిన ఆర్నాల్డ్ తన అభిప్రాయం పంచుకుంటూ 'ఈ సంఘటన గురించి చెప్పలేకపోతున్నాను. బహుషా సినిమా అయితేనే బాగుండేదేమో. నేను నిజంగా ఇలాంటి ఓ జంతువును చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. అది ఎంత బలమైన ఏనుగంటే.. మాలో కొంతమంది ప్యాంట్లు కూడా మార్చుకున్నారు' అని చెప్పారు. 'మనం ఏనుగులను చంపేయడం మానాలి. ఒక ఫోటో తీసుకోవాలి తప్ప కాల్చడం కాదు' అని ఆయన ఒక సందేశం కూడా ఇచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arnold Schwarzenegger  Chase  Elephant  safari park  south africa  

Other Articles