పెద్దల హడావుడి అంతా ఉత్తదే | Rajyasabha candidates unanimous in both telugu states

Rajyasabha seat unanimous in both telugu states

Six Rajyasabha seats, AP, Telangana, Unanimous, రాజ్యసభ నామినేషన్లు, తెలుగు రాష్ట్రాలు, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ, telugu news, latest news, political news, politics

Six Rajyasabha candidates unanimous in both telugu states.

పెద్దల హడావుడి అంతా ఉత్తదే

Posted: 06/01/2016 09:54 AM IST
Rajyasabha seat unanimous in both telugu states

ఖాళీ కానున్న 6 రాజ్య సభ స్థానాలకు జరుగబోయే ఎన్నికల్లో పోలింగ్ అవసరం లేకుండానే క్రతువు ముగిసింది. మొత్తం 57 స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో ఏపీకి నాలుగు, తెలంగాణకు రెండు సీట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా అధికార టీడీపీకి మూడు అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో నాలుగో స్థానంకి కూడా పోటీచేయాలని బావించింది. అయితే సరిపడా బలం లేకపోవటంతో వెనక్కి తగ్గింది.ఆ స్థానం కోసం అప్పటికే విపక్ష వైసీపీ అభ్యర్థి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీడీపీ పోటీ నుంచి తప్పుకోవటంతో విజయసాయిరెడ్డి భార్య సునందారెడ్డి చేత డమ్మీ నామినేషన్ దాఖలు చేయించారు. ఒకవేళ టీడీపీ ఏదైనా కుట్ర చేసి విజయసాయిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా పావులు కదిపితే అప్పుడు ఆమెను బరిలో నిలుపుతామని వైకాపా ప్రకటించింది. ఒకవేళ అలాంటిది ఏం జరగకపోతే నామినేషన్ల పరిశీలన అనంతరం, ఆమె పోటీ నుంచి విత్ డ్రా అయ్యేలా ప్లాన్ వేశారు. అధికార పక్షం టీడీపీ తరపున అభ్యర్థులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ నామినేషన్ లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మిత్రపక్షం బీజేపీకి తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బరిలోకి దిగారు. దీంతో మొత్తం నాలుగు సీట్లకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో పోలింగ్ అవసరం లేకుండా ఆయా అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లయ్యింది.

తెలంగాణ విషయానికి వస్తే రెండు సీట్లను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సీనియర్లు డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపక్ష టీ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగాలని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో లైట్ తీస్కుంది. వీహెచ్ పోటీ చేద్దామని అనుకున్నప్పటికీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు.  దీంతో ఇక్కడ కూడా పోటీ అవసరం లేకుండా గెలుపొందినట్లయ్యింది.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Six Rajyasabha seats  AP  Telangana  Unanimous  telugu news  

Other Articles