ప్రధానిని తిట్టినందుకు కాదు | Barwani collector removed for praising Nehru

Barwani collector removed for praising nehru

IAS officer Ajay Singh Gangwar, pro-Nehru comments, అజయ్ సింగ్ గంగ్వార్, మధ్యప్రదేశ్ కలెక్టర్, ట్రాన్స్ ఫర్, latest news, national news

Madhya Pradesh IAS officer Ajay Singh Gangwar suspended over comments on modi in his facebook. The transfer orders came after Gangwar posted pro-Nehru comments on the social networking site, while an earlier post allegedly criticising Prime Minister Narendra Modi is also being used to justify the government’s actions.

ప్రధానిని తిట్టినందుకు కాదు

Posted: 05/31/2016 09:51 AM IST
Barwani collector removed for praising nehru

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసి ఓ ఐఏఎస్ చిక్కుల్లో పడ్డాడు. ఫేస్ బుక్ వేదికగా యాంటీ మోదీ పోస్ట్ ఒకదానికి లైక్ కొట్టడమే కాకుండా దానికి కామెంట్ కూడా చేశాడు. బర్వానీ కలెక్టర్ అజయ్ సింగ్ గంగ్వార్ తన పౌరులంతా రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాడాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. అంతేకాదు బర్వానీ కలెక్టర్ నుంచి ఆయన్ను సెక్రటేరియట్ విభాగానికి బదిలీ చేసింది.

అయితే ఆయనపై వేటుకు చర్యకు కారణం మోదీని విమర్శించడం కాదని కాంగ్రెస్ చెబుతోంది. గతంలో జవహర్ లాల్ నెహ్రును పొగుడుతూ ఆయన ఫేస్ బుక్ లో పలు పోస్ట్ లు చేశారు. బీజేపీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనుల గురించి ఆయన కూలంకషంగా వివరించారు. అందుకే మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చర్యకు దిగిందని అంటోంది. తిరిగి బర్వానీ కలెక్టర్ గా నియమించాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లపై వివరణ కోరటం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని వాదిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Singh Gangwar  Madhya Pradesh IAS officer  comments against modi  

Other Articles