అమరావతి కలకు వరుస దెబ్బలు | AP Employees may gives shock to chandrababu

Ap employees may gives shock to chandrababu

AP Employees, chandrababu naidu, searching own office, చంద్రబాబు నాయుడు, ఏపీ ఉద్యోగులు, అమరావతికి తరలింపు, AP politics, amaravathi news, political news, latest news

Andhrapradesh employees objected searching own offices condition and not intrested to move amaravathi. Planning to long leave or voluntary retirement

అమరావతి కలకు వరుస దెబ్బలు

Posted: 05/26/2016 12:31 PM IST
Ap employees may gives shock to chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగలబోతుందా? వచ్చే నెల చివరాఖరికి ముఖ్యమైన విభాగాలను నూతన రాజధాని అమరావతికి తరలించి, పాలన కోనసాగిద్దామనుకున్న  ప్రభుత్వ ఆదేశాలకు గండిగొట్టేలా ఉద్యోగులు వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. నిజానికి నవ్యాంధ్ర రాజధానికి తరలివెళ్లేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ‘వెతుకులాట’ అనే కొత్త నిబంధనను చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. ఉన్నతాధికారులు గుంటూరు, విజయవాడలకు వెళ్లి మరీ స్వయంగా వారే దగ్గరుండి తమ కార్యాలయాలను వెతుక్కోవాలని తాఖీదులు వెళ్లాయి. అన్ని సౌకర్యాలుండే సొంత ఇళ్లను వదిలి, అధిక అద్దెలు చెల్లించి మరీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కండిషన్ తో మళ్లీ మొదటికి వస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడేందుకు వారు ఆలోచనలు చేస్తున్నారు.

గడువు ముగిసే వరకు లాంగ్ లీవ్ మీద వెళ్లాలని కొందరు యోచిస్తుండగా, ఇంకొందరైతే ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి  హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యేందుకు సిద్దమౌతున్నారు. ఇనాళ్లు మౌలిక వసతులు, అధిక అద్దెలంటూ సాకులు చూపుతూ వస్తున్న ఉద్యోగులకు ఎట్టకేలకు వెళ్లేందుకు సిద్ధపడగా, స్వయంగా వెతుకోవాలన్న ఆదేశాలు అస్సలు మింగుడు పడటం లేదు. అల్రెడీ అభివృద్ధిలో ఉన్న హైదరాబాద్ ను వదులుకుని అంత దూరం వెళ్లి సౌకర్యాలు లేని చోటు ఇబ్బందులు ఎదుర్కొనటం ఇష్టం లేదంటూ ఓ ఐఏఎస్ అధికారి బహిరంగంగానే మీడియాతో వ్యాఖ్యానించారు. మరోవైపు రాజధానికి ఉద్యోగుల తరలింపునకు సరిగ్గా నెల రోజుల గడువు మాత్రమే ఉండగా, వెలగపూడి తాత్కాలిక సచివాలయం పిల్లర్లు, శ్లాబులు మాత్రమే పూర్తయ్యాయి. ఏదేమైనా జూన్ 27 నాటికి ఉద్యోగుల్లో అత్యధికులను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించాలన్న చంద్రబాబునాయుడు ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP employees  CM chandrababu  Amaravathi  Velagapudi  AP Temporary Secretariat  

Other Articles