భర్త మీద కోపంతో ఫెవిక్విక్తో అది అతికించింది | She fix that with fevikwik

She fix that with fevikwik

Wife, Husband, Favikwik, MadhyaPradesh, ఫెవిక్విక్, మధ్యప్రదేశ్

Only an agitated wife can come up with the idea of putting glue in eyes as a lesson for her alcoholic husband. Rewa district in Madhya Pradesh saw the most bizarre incident where a woman put fevikwik glue into her husband’s eyes after a dispute!

భర్త మీద కోపంతో ఫెవిక్విక్తో అది అతికించింది

Posted: 05/25/2016 04:28 PM IST
She fix that with fevikwik

కాపురమంటే కలతలు కామన్. చిర్రుబుర్రులాడటం, చికాకు పడటం.. తర్వాత సర్దుకుపోవడం అంతకంటే కామన్.  ఒక్కోసారి అవి కాస్తా శ్రుతి మించితే ఒకరినొకరు కొట్టుకుంటారు. ఒక్కోసారి విడాకులు కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహాతల్లి మాత్రం వెరైటీగా మొగుడిపై కోపం తీర్చుకుంది.టీవీల్లో వచ్చిన ఫెవిక్విక్ యాడ్ గురించి బాగా తెలుసుకున్నట్లుంది ఆ తల్లి. అందుకే దానితో ఏం అతికిస్తే తన భర్తకు బుద్ది వస్తుందని అనుకుందో అదే పని చేసింది.

మ‌ధ్యప్రదేశ్‌లోని రీవ అనే ప్రాంతంలో ఉన్న సంతోష్‌, విజ‌య‌లక్ష్మిలు దంప‌తులు. వారిరువురికి గ‌త కొంత కాలంగా త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉన్నాయి. ఇటీవల అది తారాస్థాయికి చేరుకుంది. కొద్దిసేపు తిట్టుకొని నిద్రపోయారు. కానీ భార్య మాత్రం భర్తపై కోపం తగ్గకపోవడంతో... నిద్రపోతున్న భర్త కళ్లలో ఫెవిక్విక్ పోసి పారిపోయింది. తెల్లారి లేచి కళ్లు తెరవబోయిన భర్త సంతోష్ కు  అవి తెరుచుకోకపోవడంతో భయం వేసింది. చుట్టుపక్కల వాళ్లను కేకేస్తే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు కళ్లలో ఫెవిక్విక్ పడిందని చెప్పి... నానా తంటాలు పడి కళ్లు తెరిపించారు. ప్రస్తుతం చూడగలుగుతున్న సంతోష్.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న వారంతా ఇలాంటి పెళ్లాం మత్రం ఎవరికీ ఉండకూడదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles