ప్రమోషన్ల మీద నిషేదం ఎత్తివేత | TELANGANA LIFTS BAN ON STAFF PROMOTIONS AND TRANSFERS

Telangana lifts ban on staff promotions and transfers

Telangana, ban, Promotions, State Govt, ప్రభుత్వం, తెలంగాణ, ప్రమోషన్లు

The Telangana State government on Tuesday lifted the ban on promotions and transfers imposed by the undivided state government. The government issued an order allowing transfers before the start of this academic year so the families can settle by the time the schools reopen.

ప్రమోషన్ల మీద నిషేదం ఎత్తివేత

Posted: 05/25/2016 08:49 AM IST
Telangana lifts ban on staff promotions and transfers

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లకు మోక్షం కలుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన నిమిత్తం బది లీలు, ప్రమోషన్లపై విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 2014 మేలో విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు విభజన నాటి నిషేధం ఎత్తివేతకే వర్తిస్తాయి. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం యథాతథంగా కొనసాగనుంది.

కాగా నిషేదం ఎత్తివేతలో చిన్న చిన్న షరతులు ఉన్నట్లు కనిపిస్తోంది. తాత్కాలిక కేటాయింపులపై అభ్యంతరాలున్న ఉద్యోగులు మినహా... స్టేట్ కేడర్, సెక్రటేరియట్‌లోని పోస్టులు, హెచ్‌వోడీలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో తుది లేదా తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులందరికీ ఈ నిషేధం ఎత్తివేత వర్తిస్తుంది. ఇక విభజనతో ముడిపడి ఉన్న కారుణ్య నియామకాల విషయంలోనూ ఈ జీవోలో స్పష్టత ఇచ్చారు. 2014 జూన్ 2 తర్వాత మరణించిన లేదా అనారోగ్య కారణాలతో రిటైరైన ఉద్యోగులు తుది కేటాయింపులో తెలంగాణ రాష్టానికి చెందినట్లయితే... జూన్ 2 కంటే ముందు మరణించిన లేదా అనారోగ్యంతో రిటైరైన ఉద్యోగులకు సంబంధించిన పోస్టు తెలంగాణకు కేటాయించి ఉంటే... ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణ స్థానికుడై ఉంటే కారుణ్య నియామకానికి అర్హులుగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిషేధం ఎత్తివేతకు సాధారణ బదిలీలపై నిషేధానికి సంబంధం లేదు. సాధారణ బదిలీలపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles