అందమైన మగువ ముద్దుతో తాను చేసిన తప్పును దిద్దుకుంటానంటే.. అహా..! ఎంతటి బాగ్యం లభించిందని ఎగిరి గెంతేసి కదనరంగంలోకి దూకిన ట్రాఫిక్ పోలీసు చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిసుకుంటుంది. తన విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా, స్పీడుగా వచ్చిన కారుపై జరిమానా వేయకుండా పంపినందుకు గాను పోలీసు శాఖ అధికారులు ఆయనపై దర్యాప్తు చేపట్టారు. అందమైన మగువ ముద్దు పెడతానంటే.. ఏమైనా చేస్తావా అంటూ అతడిని ఉన్నతాధికారులు నిలదీస్తున్నారు.
అర్థరాత్రి.. ఓ అందమైన యువతి కారులో రివ్వున వస్తుంది. ఆ రోడ్డుపై నిర్ధేశించిన స్పీడు కన్నా అత్యంత వేగంగా వస్తుంది. అంతే అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలిసు అమెను అడ్డుకుని స్పీడుగా వెళ్తున్న ఆ కారుపై జరిమానా విధించబోయాడు. అయితే తాను జరిమానా కట్టనంటూ వలపులు ఒలకబోసిన యువతి.. తన తప్పును ముద్దులతో దిద్గుకుంటానంది. అంతే అమెను అమాంతంగా తన బిగి కౌగిలిలో బంధించిన పోలీసు.. సభ్య సమాజాన్ని, నడి రోడ్డున్న వున్నామన్న విషయాన్ని, రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికులు చూస్తారన్న భయం భక్తి కూడా లేకుండా అమె అధరాలను దాదాపుగా నిమిషం పాటు చుంభించాడు.
పోలీసుగా విధులు నిర్వహించాల్సిన పోలీసులు అందమైన అమ్మడు స్పీడుగా వచ్చినా.. అమె అధర చుంభనాన్ని పొంది వదిలేయడం అక్కడి వారికి ఒళ్లు మండేలా చేసింది. అంతే వారు తమ జేబులోని సెల్ ఫోన్ తీసి ఈ యావత్ ఘటనను అందులో నిక్షిప్తం చేశారు. ఇంకేముంది విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అతడ్ని నిర్వాకంపై నిలదీశారు. దీనిపై స్పందించిన అధికారులు సదరు పోలీసు అధికారి ఘటన, వీడియో క్లిపింగ్ తాము చూశామని, దానిపై దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. మెక్సికోలోని పీబ్లా ప్రదేశంలో.. మన దెగ్గర కాదండోయ్.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more