Donald Trump's hidden business dealings with Mafia boss Fat Tony

America presidential repubican front runner donald trump wants to sue

Republican, Hillary Clinton, Donald Trump, Bernie Sanders, Donald Trump, hidden business dealings, Mafia boss Fat Tony, barrack obama

Donald Trump has been linked to Mafia chieftain Anthony 'Fat Tony' Salerno again in a new investigative report.

బీరాలు పోయిన ట్రంప్.. కేసు వేస్తాడట.

Posted: 05/23/2016 02:56 PM IST
America presidential repubican front runner donald trump wants to sue

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న డొనాల్డ్ ట్రంప్‌.. తాను నడిరోడ్డుపై ఎవరినైనా కాల్చినా తనను అమెరికా అధ్యక్షుడిని కాకుండా ఎవరు అపలేరని బీరాలు పోయిన ఆయన ఇప్పడు కేసు వేస్తానని అంటున్నాడు. తన గురించి నిజాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఓ జర్నలిస్టుపై ఆయన కేసు వేస్తానని హెచ్చరిస్తున్నాడు. నిరాధారమైన అరోపణలు చేసిన జర్నలిస్టును తాను కోర్టులో ఎదుర్కోంటానని అంటున్నాడు. ఇంతకీ అంతలా బీరాలు పోయిన ట్రంప్ ఎందుకిలా కేసులు గట్రా అంటూ హైరానా చేస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. మాఫియా డాన్‌, జెనోవెస్ నేర సామ్రాజ్య అధినేత ఆంతోనీ 'ఫాట్ టోనీ' సాలెర్నొతో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నట్టు తాజాగా తేలింది. రియల్‌ ఎస్టేట్ వ్యాపారి అయిన ఆయన.. ట్రంప్‌ టవర్‌, ట్రంప్ ప్లాజా నిర్మించడానికి మాఫియా డాన్‌ ఫాట్‌ టోనీకి చెందిన కంపెనీలతో రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రముఖ జర్నలిస్టు డేవిడ్‌ కే జాన్‌స్టన్‌ వెల్లడించారు. పులిట్జర్‌ అవార్డు గ్రహీత అయిన జాన్‌స్టన్‌ 'పొలిటికో' పత్రికలో ట్రంప్‌-మాఫియా డాన్‌ సంబంధాలపై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు.

పలు కేసుల్లో దోషిగా తేలి శిక్ష ఎదుర్కొన్న ఫ్యాట్‌ టోనీకి సంబంధాలు ఉన్న కంపెనీలతో ట్రంప్‌ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడైంది. ట్రంప్‌కు మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు కథనాలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మాఫియాతో ఆయనకు లింకులు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. తాజాగా వెలువడిన పరిశోధనాత్మక కథనంలో ట్రంప్‌కు, ఫ్యాట్ టోనీకి మధ్య ఎలా రహస్య వ్యాపార ఒప్పందాలు కుదిరాయో వివరిస్తూ పలు పత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ కథనాన్ని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కొట్టిపారేశారు. ఫ్యాట్‌ టోనీతో తనకు సంబంధాలు లేవని, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాన్ని ప్రచురించినందుకు జర్నలిస్టు జాన్‌స్టన్‌పై కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  hidden business dealings  Mafia boss Fat Tony  

Other Articles