ఫ్రెండ్స్ తో పడుకోవాలని భర్తే.. | Husband forced to do romance with his friends

Husband forced to do romance with his friends

Karnataka, Husband, Wife, Friends, భర్త, బార్య, రొమాన్స్

in Karanataka, A husband forced to his wife to romance with his friends. Wife filed a case in police station.

ఫ్రెండ్స్ తో పడుకోవాలని భర్తే..

Posted: 05/20/2016 07:27 AM IST
Husband forced to do romance with his friends

అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే తన భార్యను స్నేహితులతో సెక్స్ లో పాల్గొనాలంటూ వేధిస్తున్న సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని కొప్పల జిల్లా కుష్టగిలో ఓ పురుష పుంగవుడు చేసిన నిర్వాకానికి అందరూ షాక్ తిన్నారు. తన బార్యను వేరే వాళ్లతో సెక్స్ చెయ్యాలని బలవంత పెట్టిన అతగాడి వ్యవహారం మీద కోపంతో ఊగిపోయిన ఆ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. మహంతేష్‌ అనే ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగి. కొన్నాళ్ల క్రితం అతడికి పెళ్లైంది. కొన్ని రోజులు సాఫీగానే సాగిన వారి కాపురంలో తర్వాత కలతలు మొదలయ్యాయి.

ఇటీవలి కాలంలో మహేంతేష్ ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. తన భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో పాటు గత నెల రోజులుగా తాగి స్నేహితులను నేరుగా ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టాడు. మొదట్లో స్నేహితులు హాలులో ఉంటే బెడ్ రూంలో భార్యతో మహంతేష్ సన్నిహితంగా మెలిగేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భార్యను నగ్నంగా స్నేహితుల ముందు నిలబెట్టి రాక్షసానందం పొందసాగాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోతే భౌతిక దాడులు కూడా చేశాడు.

ఆ దుర్మార్గుడి చేష్టలు అంతటితో ఆగలేదు. చివరికి స్నేహితులతో సెక్స్ లో పాల్గోవాలంటూ మహంతేష్ తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. సంప్రదాయం గల కుటుంబం నుంచి వచ్చిన ఆ బాధితురాలు అందుకు ఒప్పుకోక పోవడంతో తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు తన భర్త వేధింపుల గురించి తల్లిదండ్రులకు తెలియజేసింది. తల్లిదండ్రుల సూచన మేరకు బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Husband  Wife  Friends  భర్త  బార్య  రొమాన్స్  

Other Articles