వాళ్లు విభిన్న రంగాలలో బాగా రాణించిన వారు. ఒక్క మాటల చెప్పాలంటే వాళ్లంతా వారి వారి రంగాలలో హీరోలే. కానీ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఈ రంగంలోక అడుగుపెట్టారు. కానీ ఓటమి భారంతో పరాభవాన్ని చవిచూశారు. ఎవరు వాళ్లు అంటరా.? వాళ్లేనండీ సెలబ్రిటీ స్టేషన్ తో మన మద్యలో తిరిగేందుకు కూడా సహించని వాళ్లు. అర్థమైందంటారా.. వాళ్లు సినిమా నటులంటున్నారు కదూ. అవును వాళ్లే కానీ అందులో కొందరు మాత్రం ఈ సారి జరిగిన బెంగాల్, కేరళ, తమిళనాడులలో తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకున్నారు, వాళ్లలో కొందరు క్రీడాకారులు కూడా వున్నారండోయ్.
ఈ సారి జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటులు, క్రీడాకారులు మాత్రం చేధు అనుభవం ఎదురైంది, ఒకరిద్దరు మాత్రం తమ అదృష్టం బాగుండి శాసనభ్యులయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున తొలిసారి పోటీ చేసిన టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఓటమి చవిచూశాడు. తిరువనంతపురం నుంచి బరిలో దిగిన శ్రీశాంత్ చిత్తుగా ఓడిపోయాడు. ఇక పశ్చిమబెంగాల్లో సిలిగురి నియోజకవర్గం నుంచి తృణమాల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన భారత్ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా కూడా ఓటమి పాలయ్యాడు.
పశ్చిమబెంగాల్లో ఉత్తర హౌరా నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన నటి రూపా గంగూలీ వన్ మాన్ అర్మీలో ప్రచారం నిర్వహించి.. అంతేకాదు ఏకంగా వామపక్ష అబ్యర్థులపై దాడులకు కూడా పాల్పడిందన్న అరోపణలు వచ్చాయి. అవే అమె పరాజయానికి కూడా కారణమయ్యాయని టాక్, ఇక తమిళనాడులో డీఎండీకే చీఫ్, ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయ్కాంత్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా సంపాదించలేకపోయింది, అంతేకాదు హీరో శరత్ కుమార్ కూడా తన నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఇక కేరళలో మిత్రులైన సినీనటులు పోటీ చేసినా వారిలో ఒక్కరే గెలుపోందారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more