జయలలితను గెలిపించిన ఫ్రీ వరాలు ఇవే.. | These free assurance from Jayalalitha bring win to her

These free assurance from jayalalitha bring win to her

Jayalalitha, Tamilnadu, Tamilnadu, Kerala, Elections, Puducherry, Sreeshanth, Assam, BJP, Kerala, Vijaykanth, West Bengal, Jayalalitha, Karunanidhi, Mamata Banerjee, Oomen Chandi, తమిళనాడు, కేరళ, ఉమెన్ చాంది, కాంగ్రెస్ బిజెపి, పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు

Jayalalitha did many projects and social security programmees. But in the last movement she declear the free list from Her govt.

జయలలితను గెలిపించిన ఫ్రీ వరాలు ఇవే..

Posted: 05/19/2016 01:45 PM IST
These free assurance from jayalalitha bring win to her

తమిళనాడు ఎన్నికలు అంటే అక్కడి నాయకుల రాజకీయాలతో పాటు, వాళ్లు ప్రజలకు ఇచ్చే హామీల మీద చర్చ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు తమిళనాట దాదాపుగా అమ్మ జయలలిత గెలుపు ఖరారు కానున్న నేపథ్యంలో అక్కడ అమ్మగారు ప్రజలకిచ్చిన హామీల గురించి ప్రస్తావన జరుగుతోంది. అమ్మ చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు హామీలు ఓటర్లను బాగా ఆకర్షించాయి. కాబట్టే పాత కాలం నాటి ట్రెండ్ ను కాకుండా వరుసగా రెండో సారి తమిళనాడు సిఎంగా జయలలితను కూర్చోబెట్టనున్నారు. అమ్మగారు ప్రజలకు ఇస్తానన్న ఫ్రీ లిస్ట్ ఒక్కసారి చూస్తే ఓటర్లు ఎంతలా ఆలోచించి ఓటు వేసారో అర్థం చేసుకోవచ్చు.

* ఉచిత మొబైల్ ఫోన్లు : తమిళనాడులో రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు అందించే పథకం.
* స్కూటర్లపై 50% రాయితీ : రేషన్ కార్డు ఉన్న మహిళలు స్కూటర్లు కొంటే 50% రాయతీని ప్రభుత్వం భరించే పథకం.
* ఉచిత విద్యుత్తు : 78 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం.
* నేతలకు : నేత కార్మికులకు వివిధ కేటగిరీల వారీగా 200 నుంచి 750 యూనిట్లు ఉచిత విద్యుత్తు పథకం.
* చేనేత వస్త్రాల కొనుగోలు కూపన్ : చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఉచితంగా రూ.500 విలువ గల కూపన్ అందించే పథకం.
* మంగళసూత్రాల్లో పసిడి పెంపు : పెళ్లి చేసుకునే జంటలకు ఇస్తున్న మంగళసూత్రాల్లో బంగారం 4 గ్రా. నుండి 8 గ్రాముల పెంపు.
* ప్రసూతి సెలవులు : ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు, ప్రసూతి సహాయం రూ.12 వేల నుండి రూ. 18 వేలకు పెంపు.
* ఉచిత సెట్ అప్ బాక్స్ : ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేబుల్ టీవీ సంస్థల కనెక్షన్లు తీసుకునే వారికి ఉచిత సెట్ టాప్ బాక్సులు.
* ఉచిత ల్యాప్ ట్యాప్ : 10+2 తరగతుల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే పథకం కొనసాగింపు.
* ఉచిత ఇంటర్నెట్ : విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే పథకం. ఉచిత వైఫై : బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించే ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం : వృత్తి విద్యా శిక్షణనిచ్చి * ప్రతి ఇంటి నుంచి ఒకరికి ఉద్యోగ కల్పన.
* ఉద్యోగులకు ఇంటికి ఋణం : ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు రూ. 40 లక్షల వరకు రుణ సహాయం.
* మద్యనిషేధం : రాష్ట్రంలో దశల వారీగా మద్యనిషేధం అమలు చేయాలని నిర్ణయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles