పాలేరులో దూసుకెళుతున్న కారు | TRS leading in Paaleru elections

Trs leading in paaleru elections

TRS, Telangana, Tummala Nageshwar Rao, టిఆర్ఎస్, తెలంగాణ, తుమ్మల నాగేశ్వర్ రావు, పాలేరు

TRS party almost getting lead in By elections. Tummala Nageshwar Rao with 5973 votes.

పాలేరులో దూసుకెళుతున్న కారు

Posted: 05/19/2016 10:41 AM IST
Trs leading in paaleru elections

పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం దిశగా దూసుకెళుతున్నారు. లెక్కింపులో భాగంగా అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించారు. మొత్తం 14 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలవగా వాటిలో ఏడు ఓట్లను తుమ్మల కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి 14 ఓట్లలో ఆమె కూడా 6 ఓట్లను దక్కించుకున్నట్లు సమాచారం. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో తుమ్మల భారీ ఆధిక్యం సాధించారు. సుచరితారెడ్డి కంటే ఆయనకు 4,180 మేర అధికంగా ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో తుమ్మలకు 5,978 ఓట్లు రాగా, సుచరితారెడ్డికి కేవలం 1,798 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈనెల 16న పాలేరు నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించగా... 89.73శాతం పోలింగ్‌ నమోదైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి రాంరెడ్డి సుచరితారెడ్డి... సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌తో పాటు... 13మంది స్వతంత్ర్య అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్‌ నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో ఇక్కడ బైపోల్ జరిగింది.తెలంగాణ మంత్రులు ముందు నుంచి పాలేరు మీద పూర్తి దృష్టిని సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మలకు ఇస్తున్న ప్రాధాన్యత మీద ఓటర్లు దృష్టిలో ఉంచుకొని ఓటు వేసినట్లు కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles