Watch: Drunk woman slaps cop near Vasant Vihar police station

Drunk woman slaps cop near vasant vihar police station

auto driver, auto driver drunk nepali woman, Drunk woman slaps police, Drunk rage, Vasant Vihar police station, Drunk woman, Drunk woman slaps police constable, Safdarjung Hospital, medical examination

A young woman created a ruckus outside Vasant Vihar police station in the Capital and slapped a woman police constable who came to pacify her.

ITEMVIDEOS: పరాయిదేశ పాప.. పబ్లిక్ గా పోలీసును కోట్టింది..

Posted: 05/16/2016 08:28 PM IST
Drunk woman slaps cop near vasant vihar police station

నేపాల్కు చెందిన ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై చేయిచేసుకుంది. ఢిల్లీలోని మునిర్కాలో నేపాల్ యువతి (28) ఆటో ఎక్కింది. అప్పటికే అతిగా మద్యంతాగిన ఆమె ఆటో డ్రైవర్ను వేధించడం మొదలు పెట్టింది. డ్రైవర్ను బూతులు తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది. దీంతో అతను పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. ఆటో నుంచి దిగకుండా సతాయిస్తోందని, తనను కొడతానంటూ బెదిరిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆటోను తీసుకెళ్లి వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆపాడు. పోలీసులు రావడంతో వారి పట్లా ఆమె దురుసుగా ప్రవర్తించింది. ఓ మహిళ కానిస్టేబుల్ను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టింది. మరో మహిళా కానిస్టేబుల్ను దూషిస్తూ దాడి చేసింది. పోలీసులు నేపాల్ యువతిని అదుపులోకి తీసుకుని వైద్యపరీక్ష కోసం సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మద్యంతాగినట్టు పరీక్షల్లో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. కాగా ఆటో డ్రైవర్ తన సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : auto driver  nepali woman  drunk  police  delhi  

Other Articles