Anna Hazare receives a death threat for 'spreading unrest in society'

Anna hazare gets yet another threat letter

Anna Hazare, threat letter to anna hazare, anna hazare death threat, marathi letter threatening anna, hazare spreading unrest, anna spokesperson Shyam Asawa, Ambadas Lashkare

Social activist Anna Hazare's office received a letter threatening to kill him for stoking "unrest" in society, his aide said.

రూటు మార్చిన అగంతకులు, అన్నాను హతమారుస్తామని మరాఠిలో లేఖ

Posted: 05/16/2016 07:18 PM IST
Anna hazare gets yet another threat letter

ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి రహిత భారత్ కోసం ఉద్యమించి లోక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించిన ఆశాకిరణం, గాంధేయవాది అన్నాహజారేకు మళ్లీ బెదిరింపు లేఖలు వచ్చాయి. అన్నాను హతమారుస్తానంటూ ఓ వ్యక్తి ఆయన కార్యాలయానికి బెదిరింపు లేఖ పంపారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా అగంతకులు ఈ సారి ట్రెండ్ మార్చారు. తమను తాము మహారాష్ట్ర వాసిగా చాటుకునేందోకో ఏమో తెలియదు కానీ, మరాఠీలో చేతిరాతతో లేఖను రాసారు.
 
అన్నా హజారే సమాజంలో అశాంతికి కారణమవుతున్నారని, అందుకే అంతమొందిస్తామని ఉందని  ఆయన కార్యాలయ ప్రతినిధి శ్యామ్ అశ్వా తెలిపారు. లేఖలో  రాసిన వ్యక్తి తనను నెవెసాకు చెందిన  అంబాదాస్ లష్కరేగా పేర్కొన్నాడు. హజారేకు బెదిరింపు లేఖపై సమాచారాన్ని గురించి ఆయన కార్యాలయాన్ని కోరగా, లేఖ వచ్చింది నిజమేనని చెప్పిన పోలీసులు దాని గురించి వివరించేందుకు మాత్రం నిరాకరించారు. 33 నెలల్లో ఇది 15వ బెదిరింపు లేఖ. కానీ ఈసారి ఆయనను జనవరి 26న హతమారుస్తామని లేఖలో పేర్కొన్నారు.

గాంధేయవాది ఇటువంటి బెదిరింపులకు భయపడరని  హజారే వ్యక్తిగత కార్యదర్శి అసవ తెలిపారు. హజారేకు జెడ్ కేటగిరీ రక్షణ ఉంది. అయితే ఈ లేఖ కన్నా ముందు ఆయనకు భూ సంస్కరణల చట్టంలో మార్పుల కోసం ఉద్యమిస్తానన్న సమయంలో చివరి బెదిరింపు లేఖ వచ్చింది. కాగా పోలీసుల మాత్రం ఆయనకు భద్రత, రక్షణ పెంచుతున్నారే తప్ప. ఆ లేఖల వెనుకనున్న అగంతకులు ఎవరన్న విషయం మాత్రం గుర్తించలేకపోతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anna Hazare  letter  death threat  marathi  spreading unrest  Ambadas Lashkare  

Other Articles