Cellphone addict wife chops off techie husband's fingers for reading her SMSes!

Bengaluru horror teacher chops off fingers of techie husband

Teacher, chops, husband, chating, cell phone, sms, software engineer, wife mobile, finger, chating addicted wife, social media addicted wife,

An angry woman chopped off her husband's finger in a fit of rage. The incident has come to light near Sarjapura road in Kaikondanahalli.

ITEMVIDEOS: నిత్యం ‘ఆ’ పని వద్దన్న భర్త చేతివేళ్లు కోసేసింది

Posted: 05/16/2016 06:34 PM IST
Bengaluru horror teacher chops off fingers of techie husband

ప్రపంచాన్ని మన చేతుల్లోకి తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్.. భార్యభర్తల మధ్య కూడా లడాయిలకు కారణమవుతుంది. ఛాటింగ్ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఓ పంతులమ్మను నిత్యం అదే పనిలో నిమగ్నం కావద్దంటూ అమె భర్తైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పలుమార్లు సూచించాడు. అయినా అమె అదే పనిగా ఛాటింగ్ చేసే పనిలో నిమగ్నమైంది ఆ టీచరమ్మ. ఇక దీంతో వేగలేకపోతున్నానని అనుకున్నాడో ఏమో.. అమెను కాస్త గట్టిగానే హెచ్చరించాడు. అంతే తనపైనే అజమాయిషీ చేస్తావా..? అని అనుకుందో ఏమో చిర్రెత్తిన టీచరమ్మ ఏకంగా భర్త వేళ్లను కోసేసింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో టీచర్ గా పని చేస్తున్న సునీతా సింగ్ కు సెల్ ఫోన్ వ్యసనంగా మారింది. ఆమె ఎప్పుడూ సెల్ ఫోన్ లో ఛాటింగ్ చేస్తూ ఉండడంతో ఆమె భర్త చంద్రకాంత్ సింగ్ పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త ఎన్ని పర్యాయాలు సూచించినా, హెచ్చరికలు చేసినా.. అవి అమె ముందు మాత్రం చెవిటివాడి ముందు శంఖంగానే మారాయి. అంటే భర్త వున్నా.. లేకున్నా అమె తన ఛాటింగ్ లోకంలోనే నిత్యం విహరించేది. ఎంత చెప్పినా వినకుండా ఛాటింగ్ ఎందుకు చేస్తుందని భర్త చంద్రకాంత్ సింగ్ కు అనుమానం వచ్చింది.

ఇంకేముంది సునితా సింగ్ వంటింట్లో వున్న సమయంలో అమె సెల్ ఫోన్ తీసి చూసి అవ్వాక్కయ్యాడు. మరోలా చెప్పాలంటే షాక్ తో నోట మాటరాలేదు. నిమిషాల తరువాత షాక్ నుంచి తేరకున్న చంద్రకాంత్ సింగ్.. అమెను నిలదీసాడు. ఫోన్ ఛాటింగ్ లో డియర్, డార్లింగ్ అంటూ అవతలి వైపు నుంచి మెసేజిలు ఉన్నాయేంటి అని అడిగేసాడు. అదే అతడు చేసిన తప్పు. అంతే నా సెల్ ఫోన్ లోని మెసేజ్ లు నువ్వెందుకు చూశావంటూ భర్తపై అంతెత్తున లేచింది సునితా. సరిగ్గా వంటగదిలో వంట చేస్తున్న ఆమె, తానేం చేస్తున్నానో మర్చిపోయిన అమె ఏకంగా భర్త చేతి వేళ్లను తన చేతిలోని కత్తితో కోసేసింది.

అలా అని ఏదో ఒక వేలు తెగిందనుకుంటున్నారా.. కాదు ఏకంగా మూడు చేతి వేళ్లు తెగిపడ్డాయి. దీంతో అనూహ్య పరిణామాలు ఎదురుకావడంతో లబోదిబో మనుకుంటూ చంద్రకాంత్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, భార్యపై గృహ హింస కేసు పెట్టాడు. తాను చేసిన తప్పును నిలదీస్తే తన భార్య తనపైనే కత్తి దూసిందంటూ పిర్యాదులో పేర్కోన్నాడు. మరి వీరిద్దరూ కలసి సంసారాన్ని సాగించడం కూడా అనుమానమేనని అంటున్నారు స్థానికులు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  chops  husband  chating  cell phone  sms  software engineer  

Other Articles