strangers robbed union ministers mobile phone

Union minister mobile phone robbed

bandaru dattatreya mobile robbed, bandaru dattatreya mobile phone, union minister mobile robbed, robbery, bandaru dattatreya's house, musheerabad police station, bandaru dattatreya, cell phone, telangana, theft, bjp,

Theft in Union Minister Bandaru Dattatreya's residence on Sunday morning. thieves stole away his mobile phone.

కేంద్రమంత్రిగారి ఫోన్ తెగనచ్చేసింది.. అందుకనే..

Posted: 05/15/2016 12:40 PM IST
Union minister mobile phone robbed

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సెల్‌ఫోన్‌ వాళ్లకు తెగనచ్చేసిందనుకుంటా.. అందుకనే ఆగంతకులు ఏకంగా కేంద్రమంత్రి ఫోన్ అని కూడా చూడకుండా కొట్టేశారు. అదేంటి మంత్రి గారి ఫోన్ కోట్టేశారా..? అనుకుంటున్నారా..? నిజమేనండీ. మరి దత్తాత్రేయ ఇంట్లో లేరా..? అంటే ఆయన ఇంట్లోనే వున్నారు. రామ్‌నగర్‌లోని మీ సేవా కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న మంత్రి దత్తాత్రేయ అక్కడి నుంచే ఫోన్ పోయింది. డీటేల్స్ లోకి వెళ్తే.. శనివారం అర్ధరాత్రి వీచిన గాలులకు చెట్లు విరిగి పడిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దీంతో దత్తాత్రేయ  వాడుతున్న శామ్‌సంగ్ సెల్‌ఫోన్‌లో చార్జింగ్ అయిపోయింది. రాత్రి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆదివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి ముందున్న గదిలో చార్జింగ్ పెట్టారు. బయట సందర్శకులు చాలా మంది వచ్చి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో మంత్రి పీఏ యుగేందర్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ విలువ సుమారు రూ.25వేల వరకు ఉంటుందని అంచనా. కాగా, కేంద్ర మంత్రి సెల్ పోన్ లో పలువురు నేతలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు డీటెల్స్ వున్న నేపథ్యంలో ఇప్పడది హాట్ టాపిక్ గా మారింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandaru dattatreya  cell phone  telangana  theft  bjp  

Other Articles