Cockpit punch-up as rowdy female passenger 'decks easyJet pilot'

Cockpit punch up as rowdy female passenger decks easyjet pilot

plane, easyjet, Manchester, airport, female passenger, easyJet pilot, Manchester flight, delayed, ROWDY female passenger, Manchester to Paphos flight, Cyprus, passenger attacked the captain, passenger smacked pilot in the face,

A ROWDY female passenger caused panic on board an easyJet plane after punching the pilot in the face.

అమ్మడి పంచ్కి.. పైలెట్ ఫ్లాట్.. ఆగిన విమానం..

Posted: 05/13/2016 09:56 PM IST
Cockpit punch up as rowdy female passenger decks easyjet pilot

విమానంలో తొలిసారి ప్రయాణం చేస్తున్నారా..? అయితే ఒకింత అత్యుత్సాహం వుందా..? అయినా పర్వాలేదు.. కానీ విమాన సిబ్బందికి మాత్రం అనుమానాలు వచ్చేలా మాత్రం ప్రవర్తించకండి. మీరు నిత్యం విమానయానం చేసేవారైనా సరే.. అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తే మిమ్మల్ని విమానం నుంచి సిబ్బంది బలవంతంగా దింపేస్తారు. ఇలా పరాభవం ఎదురైన వాళ్లు తమ అక్రోశాన్ని విమాన సిబ్బందితో గానీ లేక విమానాశ్రయంలోని సంబంధిత యాజమాన్యంతో కానీ గొడవ పడుతుంటారు. తాము ఎదుర్కోన్న దారుణాన్ని మీడియా ముందు వ్యక్తం చేస్తూ.. విమానా సిబ్బందిపై కోర్టులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తుంటారు.

కానీ, ఇలాంటి పరాభవమే ఎదురైన ఓ యువతి ఇలాంటివేమి చేయకుండా ఏకంగా ఫ్లైట్ ను రెండు గంటలపాటు అపింది, అదెలా..? వివరాల్లోకి వెళ్తే.. అనుచిత ప్రవర్తన విమాన ఆలస్యానికి కారణమైంది. ఈ సంఘటన మాంచెస్టర్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. సైప్రస్లోని పపోస్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఈజీ జెట్ఫ్లైట్లో ప్రవర్తనలో తేడా ఉన్న ఓ యువతిని విమాన సిబ్బంది బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆగ్రహం చెందిన ఆ యువతి సిబ్బంది సమక్షంలోనే పైలెట్ పై దాడికి దిగింది.  

ఆగ్రహంతో ఊగిపోతూ పైలట్ మోహంపై పంచ్ల వర్షం కురిపించింది. దీంతో వివాదం చెలరేగింది. అటు పైలెట్పై దాడి చేసినందుకుగానూ గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఆ అమ్మడిని అరెస్ట్ చేశారు. రెండు గంటలు ఆలస్యం తర్వాత విమానం తిరిగి బయలుదేరింది. అయితే సదరు యువతి మాదకద్రవ్యాల కేసులో పోలీసుల వాంటెడ్ లిస్ట్లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇలాంటి ఘటనే గత ఏడాది కూడా ఈజీ జెట్ఫ్లైట్లో చోటు చేసుకుంది. సాండ్ విచ్కోసం చాలా సేపు వేచి చూసిన ఓ ప్రయాణికుడు విమాన అటెండెంట్పై దాడికి దిగాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : female passenger  easyJet pilot  Manchester flight  delayed  

Other Articles