Bangladesh teen cricketer beaten to death over 'no-ball' argument

Young cricketer in bangladesh killed with stump

cricketer in Bangladesh, cricketer dead in Bangladesh, cricketer death in Bangladesh, Bangladesh, teen beaten to death, Fight during cricket match, Babul Shikdar

A teenage cricketer in Bangladesh was allegedly killed by a stump-wielding batsman after he taunted the umpire over a no-ball delivery.

యువ క్రికెటర్ ప్రాణం తీసిన క్రికెట్ పంచాయితీ..

Posted: 05/13/2016 11:09 AM IST
Young cricketer in bangladesh killed with stump

గల్లీగల్లీల్లో క్రికెట్‌ ఆడటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. గల్లీ క్రికెట్ నుంచి జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన వారు కూడా చాలా మందే వున్నారు. గల్లి నుంచి పాఠశాల, లీగ్ స్థాయి, జిల్లా, రాష్ట్ర, ఇలా చివరికి జాతీయ స్థాయిలోకి అగుడుపెట్టిన వారు కూడా వున్నారు. అయితే గల్లీ క్రికెట్ లో అడుతున్న సమయంలోనే చాలా కేర్ ఫుల్ గా వుండాలి. ఎందుకంటే అక్కడ ఎలాంటి నిబంధలను, కోడ్ లు వుండవు. ఎవరు ఎవరిపైనైనా తిరగబడతారు. స్పోర్టివ్ స్పిరిట్ అన్న మాటకు అర్థం కూడా తెలియని వయస్సు అది.

అందుకనే గల్లీ స్థాయిలో పిల్లలు అడేప్పుడు పెద్దలు పర్యవేక్షణ చాలా అవసరం. అలాంటి పర్యవేక్షణ లోపించిన పక్షంలో క్షణికావేశంలో జరిగే ఘర్షణలు ప్రాణాలను కూడా హరిస్తుంటాయి. అలా గల్లీ క్రికెట్‌లో 'నోబాల్‌' విషయమై జరిగిన గొడవ ఓ టీనేజ్‌ క్రికెటర్‌ ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం జరిగింది. 'నోబాల్‌' విషయమై వికెట్ కీపర్‌ గొడవకు దిగడంతో బ్యాట్స్‌మన్ అతన్ని వికెట్‌తో తలపై బాదాడు. దీంతో మైదానంలోనే ఆ యువకుడు కుప్పకూలాడు.

స్థానిక పోలీసు అధికారి భుయాన్ మహబూబ్ హసన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం స్నేహితులంతా కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడుకుంటుడగా ఈ ఘటన జరిగింది. 16 ఏళ్ల బాబుల్ షిక్దర్‌ వికెట్ కీపర్‌గా ఉన్న సమయంలో బ్యాట్స్‌మన్‌ను ఎంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే, బౌలర్‌ వేసిన బంతిని నోబాల్‌గా ప్రకటించి.. బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా డిక్లేర్‌ చేయాలని బాబుల్ షిక్దర్ ఎంపైర్‌తో గొడవకు దిగాడు. అంతకుముందు బంతిని కూడా ఇలాగే 'నోబాల్‌'గా ప్రకటించారు.

ఇలా మొదలైన గొడవ పెరిగి పెద్దదవ్వడంతో బ్యాట్స్‌మనే వికెట్‌ తీసుకొని షక్దర్‌ తలపై బాదాడు. దీంతో కుప్పకూలిన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు విడిచాడు. షక్దర్‌ను కొట్టిన బ్యాట్స్‌మన్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, భారత్‌లో మాదిరిగానే దక్షిణాసియా దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలోనూ క్రికెట్ ఫీవర్‌ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  teen beaten to death  Fight during cricket match  Babul Shikdar  

Other Articles