Raghuram Rajan not fit to be RBI governor

Raghuram rajan not fit to be rbi governor

Raghuram Rajan, RBI, Reserve Bank Of India, Subrahmanian swamy, BJP, రఘురాంరాజన్, ఆర్.బి.ఐ, సుబ్రహ్మణ్యస్వామి

Days after being nominated to the Rajya Sabha by the Bharatiya Janata Party (BJP), politician leader Subramanian Swamy on Thursday embarrassed his party by saying RBI governor Raghuram Rajan should be removed from his post as he is not fit for the nation.

ఆర్.బి.ఐ గవర్నర్ ను తొలగించాలట..!

Posted: 05/13/2016 08:00 AM IST
Raghuram rajan not fit to be rbi governor

ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్య చేసి వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఈసారి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ను టార్గెట్ చేసారు. రాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉండేందుకు అసలు అర్హుడే కాదని గురువారం నాడు వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై కొద్ది రోజులు కాకముందే స్వామి ఈ వ్యాఖ్యలు చేయడం బీజేపీని ఇరకాటంలో పడేసింది. గురువారం నాడు స్వామి మాట్లాడుతూ రఘురాం రాజన్ ను గవర్నర్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసారు.

అయితే, ఉన్నట్లుండి స్వామికి రఘురాం రాజన్ పై అంత కోపం ఎందుకొచ్చిందనేది పరిశీలిస్తే.. బుధవారం నాడు లండన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్ రాజన్ కొన్నివ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలే స్వామి ఆగ్రహానికి కారణం. విదేశీ బ్యాంకులు తమ శాఖలను భారతదేశంలో తెరవడం ఆపేసాయని, దేశంలో క్రెడిట్ రేటింగ్ శాతం అత్యధిక రిస్క్ (హయ్యర్ రిస్క్)తో కూడుకుని ఉండటమే దీనికి కారణమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉపన్యాసంలో రాజన్ చెప్పారు.

ఈ నేపథ్యంలో భారత్ లో తమ బ్యాంకులను అధిక మూలధనంతో తెరవడం అంత లాభసాటి కాదని ఆయా విదేశీ బ్యాంకుల యాజమాన్యాలు భావిస్తున్నాయని చెప్పారు. వీటిని ప్రస్తావించిన స్వామి... రఘురాం రాజన్ వ్యాఖ్యలు దేశంపై దుష్ప్రభావాన్ని చూపుతాయన్నారు. ఇప్పటికే ఆయన వ్యవహార శైలి వల్ల దేశంలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయని, నిరుద్యోగం పెరిగిందని మండిపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. వీలైనంత త్వరగా ఆయనను పదవినుండి ఉద్వాసన పలకాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles